Breaking News

సమస్యల్ని పరిష్కరించా విజయాలెన్నో సాధించా

Published on Fri, 12/19/2025 - 05:34

న్యూయార్క్‌/వాషింగ్టన్‌: జో బైడెన్‌ ప్రభుత్వం వారసత్వంగా తనకు ఇచ్చిన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించి దేశాన్ని అభివృద్ధిపథంలో ఉరకలెత్తిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. 2025 ఏడాది మరో రెండు వారాల్లో ముగుస్తున్న నేపథ్యంలో తన 11 నెలల పాలనపై ట్రంప్‌ 19 నిమిషాలపాటు గురువారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తన విజయాల పరంపర ఇదేనంటూ పలు అంశాలను ప్రస్తావించారు.

 ‘‘ బైడెన్‌ తన పాలనలో ప్రపంచంలోనే అమెరికా సరిహద్దును అత్యంత దుర్భలంగా మార్చారు. నేను దుర్భేద్యంగా పటిష్టపరిచా. ఇలాంటి ఎన్నో సమస్యలతో అధ్వానస్థితిలో అమెరికా పరిపాలనా పగ్గాలను ఆయన నాకు వారసత్వంగా ఇచ్చారు. ఆ సమస్య లను నేను సమర్థవంతంగా సరిదిద్దు తున్నా. అమెరికాకు పూర్వవైభవం తీసుకొచ్చా. 10 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 8 ప్రధానమైన యుద్ధాలను నిలువరించా. 

ఇరాన్‌ నుంచి పొంచి ఉన్న అణుఉపద్రవాన్ని అడ్డుకున్నా. 3,000 సంవత్సరాల్లో సాధ్యంకాని పశ్చిమా సియాలో శాంతిని స్థాపించా. హమాస్‌–ఇజ్రాయెల్‌ యుద్ధాన్ని ఆపేసి గాజాలో శాంతి కపోతాలను ఎగరేశా. భారత్‌–పాకిస్తాన్, థాయిలాండ్‌–కాంబోడియా, అర్మేనియా–అజర్‌బైజాన్, కొసొవో, సెర్బియా, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియో పియా, రువాండా, కాంగోల మధ్య సమరాలు సమసిపో యేలా చేశా. బైడెన్‌ హయాంలోనే అమెరికాలోకి లక్షలాదిగా అక్రమ చొరబాట్లు ఎక్కువయ్యాయి. వీళ్ల కోసం బైడెన్‌ సర్కార్‌ అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును అనవసరంగా ఖర్చుచేసింది’’ అని ట్రంప్‌ ఆరోపించారు.

వీళ్ల కారణంగానే ఇళ్ల అద్దెలు పెరిగాయి
‘‘విదేశీ వలసదారులు పోటెత్తడంతోనే ఇళ్ల అద్దెలు పెరిగాయి. రెంటల్‌ మార్కెట్‌ 60 శాతం పెరగడానికి బైడెన్‌ ప్రభుత్వ తప్పుడు విధానాలే కారణం. టారిఫ్‌ అనే పదం నాకెంతో ఇష్టం. టారిఫ్‌ల బెత్తం చూపించి అమెరికాలోకి మళ్లీ కర్మాగారాలు క్యూ కట్టేలా చేశా. అమెరికాకు 18 ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రప్పించా. దీంతో ఉద్యోగాలు, జీతభత్యాల పెంపు, ఆర్థికాభివృద్ధి, కొత్త ఫ్యాక్టరీల ఆరంభాలు, పటిష్టమైన జాతీయ భద్రతను సాకారంచేశా. ఉత్పత్తకేంద్రాలను అమెరికాలో నెలకొల్పితే టారిఫ్‌లు ఉండబోవని కంపెనీలకు ఇప్పుడు అర్థమైంది. డ్రగ్స్‌ భూతాన్ని దూరంగా తరమికొట్టా. అందుకే భూ, సముద్రమార్గాల ద్వారా అమెరికాలోకి విదేశీ మత్తుపదార్థాల రాక 94 శాతం తగ్గింది. గత అర్థశతాబ్దకాలంలో తొలిసారిగా దేశం నుంచి అక్రమవలసదారులు తిరిగి వెళ్లిపోతున్నారు. వాళ్లు వదిలేసిన ఇళ్లు, ఉద్యోగాలు అమెరికన్లకు దక్కుతున్నాయి ’’ అని ట్రంప్‌ చెప్పుకొచ్చారు.  
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)