Breaking News

ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు 

Published on Mon, 07/20/2026 - 04:52

దుబాయ్‌: ఇరాన్‌పై అమెరికా సైన్యం ప్రతీకారంతో రగిలిపోతోంది. జోర్డాన్‌లో జరిగిన దాడిలో ఇద్దరు అమెరికా జవాన్లు మరణించడంతో యుద్ధం మరింత ఉధృతమవుతోంది. అమెరికా ఆదివారం ఇరాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. వైమానిక దాడులకు దిగింది. క్షిపణులు డ్రోన్లు, ప్రయోగించింది. ఇరాన్‌ సైతం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా జోర్డాన్‌లో అమెరికా స్థావరాలపై గురిపెట్టింది. 

రానున్న రోజుల్లో ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారే సూచనలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కోట్ల మంది ఆధారమైన పౌర మౌలిక సదుపాయాలను ఇరుపక్షాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. జోర్డాన్‌లో శుక్రవారం జరిగిన దాడికి ప్రతిస్పందనగా ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌(ఐఆర్‌జీసీ)పై ఆదివారం భీకర దాడుల చేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. 

మరోవైపు ఇరాన్‌ వైమానిక దాడుల నుంచి రక్షించుకోవడానికి బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌ తమ గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేశాయి. తమ పొరుగు దేశమైన జోర్డాన్‌ వైపు ప్రయోగించిన క్షిపణుల వల్ల మంటలు భూభాగంలోకి వ్యాపించే అవకాశం ఉందని, అదే జరిగితే ఇరాన్‌కు తగిన బుద్ధి చెప్తామని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది.  

ఇరాన్‌ అణు విద్యుత్‌ కేంద్రం నిర్మాణ స్థలంపై దాడి  
ఇరాన్‌ సైనిక తీరప్రాంత నిఘా, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి, డ్రోన్‌ నిల్వ స్థావరాలపై దాడి చేసినట్లు అమెరికా మిలటరీ సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది. హార్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ నియంత్రణను దెబ్బతీయడానికి, ఐఆర్‌జీసీ దళాలను శిక్షించడానికి వ్యూహం రూపొందించినట్లు పేర్కొంది.  నైరుతి ప్రాంతంలో నిర్మించతలపెట్టిన అణు విద్యుత్‌ కేంద్రం నిర్మాణ స్థలాన్ని అమెరికా లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపినట్లు ఇరాన్‌ అణు శక్తి సంస్థ పేర్కొంది.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)