అధ్యక్షుడిగా కొన్ని గంటలే.. బైడెన్‌ సంచలన నిర్ణయాలు!

Published on Mon, 01/20/2025 - 18:58

వాషింగ్టన్‌: మరికొన్ని గంటల్లో అమెరికాకు అధ్యక్షుడిగా మరోసారి డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదే సమయంలో జో బైడెన్‌ అమెరికా అధ్యక్ష పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో బైడెన్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధ్యక్ష స్థానంలో బైడెన్‌ పలువురికి క్షమాభిక్షలు కల్పిస్తున్నారు.

వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడిగా తనకు ఉన్న ప్రత్యేక అధికారాలతో చివరి గంటల్లో జో బైడెన్‌(joe Biden) క్షమాభిక్షలు ఇస్తున్నారు. మరికొద్ది గంటల్లో జో బైడెన్‌ అధ్యక్ష పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలోనే అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ, రిటైర్డ్‌ జనరల్‌ మార్క్‌ మిల్లె తదితరులకు ముందస్తు క్షమాభిక్ష జారీ చేశారు. అలాగే, క్యాపిటల్‌ హిల్‌ దాడులపై విచారణ జరిపిన హౌస్‌ కమిటీ సభ్యులకూ కూడా ఉపశమనం కల్పించారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రతీకార చర్యలు తీసుకునేందుకు వీలులేకుండా ఈమేరకు చర్యలు తీసుకున్నారు. దీంతో, క్షమాభిక్షల వ్యవహారం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. 2021, జనవరి ఆరో తేదీన క్యాపిటల్‌ హిల్‌పై దాడులు జరిగిన విషయం తెలిసిందే.

ఈ సందర్బంగా బైడెన్‌ మాట్లాడుతూ.. ఈ ప్రజా సేవకులు మన దేశానికి గౌరవంగా, విశిష్టతతో సేవ చేశారు. అన్యాయంగా, రాజకీయంగా ప్రేరేపించబడిన నేరాల కారణంగా శిక్ష అనుభవిస్తున్నారు. ఇవి అసాధారణమైన పరిస్థితులు అంటూ చెప్పుకొచ్చారు. 
 

మరోవైపు.. అమెరికా అధ్యక్ష పీఠం దిగబోతున్న జో బైడెన్‌ తన పదవీకాలంలో చివరి రోజున దక్షిణ కరోలినాలో గడిపారు. 2020లో డెమోక్రటిక్‌ ప్రైమరీ ఎన్నికల్లో నెగ్గినప్పటి నుంచి ఆ ప్రాంతంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం శ్వేతసౌధానికి చేరింది. పదవి ముగుస్తున్న తరుణంలో ఆయన వీడ్కోలు ప్రసంగం చేయనున్నారు. గతంలో తన విజయానికి కారకులైనవారికి అక్కడి నుంచి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. శ్వేతసౌధాన్ని బైడెన్‌ ఖాళీచేసి వెళ్లడానికి, ట్రంప్‌ అందులోకి రావడానికి కావాల్సిన ఏర్పాట్లను ఐదు గంటల్లో పూర్తి చేయాల్సి ఉండటంతో సంబంధిత సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)