Breaking News

జార్జియాలో నిర్బంధంలోకి 475 మంది విదేశీయులు 

Published on Sat, 09/06/2025 - 05:17

వాషింగ్టన్‌:  అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నవారి కోసం వేట కొనసాగుతోంది. చట్టవిరుద్ధంగా వలస వచ్చినవారిని గుర్తించి, వెనక్కి పంపించడానికి డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అమెరికాలోని జార్జియాలో 475 మంది అక్రమవలసదార్లను నిర్బంధించినట్లు హోంల్యాండ్‌ సెక్యూరిటీ అధికారి స్టీవెన్‌ ష్రాంక్‌ శుక్రవారం వెల్లడించారు. జార్జియాలో దక్షిణ కొరియాకు చెందిన హ్యూందాయ్‌ కంపెనీ ప్లాంట్‌ ఉంది. 

ఇక్కడ ఎలక్ట్రిక్‌ వాహనాలు తయారు చేస్తుంటారు. ఇందులో దక్షిణ కొరియా పౌరులు అక్రమంగా పని చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. తాజాగా నిర్బంధంలోకి తీసుకున్నవారి అక్రమ వలసదార్లతో ఎక్కువ మంది దక్షిణ కొరియా పౌరులే ఉన్నట్లు స్టీవెన్‌ ష్రాంక్‌ తెలిపారు. జార్జియాలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు స్థానికులకు దక్కాలి తప్ప అక్రమంగా వలసవచ్చినవారు సొంతం చేసుకోవడం సరైంది కాదని అన్నారు. 

ఒకేచోట 475 మంది అదుపులోకి తీసుకోవడం హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఆపరేషన్ల చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అమెరికాలో తమపౌరులను అక్కడి అధికారులు నిర్బంధించినట్లు దక్షిణ కొరియా విదేశాంగ శాఖ కూడా ధ్రువీకరించింది. అయితే, ఎంతమంది అనే విషయం బయటపెట్టలేదు. డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాల మేరకు హోంల్యాండ్‌ సెక్యూరిటీ అధికారులు సోదాలు ముమ్మరంచేశారు. ప్రధానంగా విదేశీయులు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)