Breaking News

వెనిజులాపై ట్రంప్‌... పూర్తిస్థాయి యుద్ధం? 

Published on Thu, 12/18/2025 - 05:19

వాషింగ్టన్‌: దక్షిణ అమెరికా దేశం వెనిజులాలోని అపార చమురు నిల్వలపై కన్నేసిన ట్రంప్, వాటిని ఎలాగైనా చేజిక్కించుకునే ప్రయత్నాలకు మరింత పదును పెడుతున్నారు. అందులో భాగంగా ఆ దేశానికి చమురు నౌకల రాకపోకలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. సాగర జలాల్లో భారీగా నేవీ, సైన్యాన్ని మొహరించి ప్రతి చమురు నౌకనూ అడ్డుకుని తీరుతామని సొంత సోషల్‌ మీడియా ‘ట్రూత్‌ సోషల్‌’ఖాతాలో మంగళవారం ఆయన పోస్ట్‌ పెట్టారు.

 ‘వెనిజులాను అన్నివైపుల నుంచి దిగ్బంధించాం.  కనీవినీ ఎరగనంతటి సంఖ్యలో సైన్యం ఆ దేశాన్ని చుట్టుముట్టనుంది. వెనిజులా చమురు విక్రయ సొమ్మంతా అమెరికాలోకి డ్రగ్స్, హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ వంటివాటికే ఉపయోగపడుతోంది. ఇది మా దేశ భద్రతకే సవాలుగా మారింది. అందుకే ఈ దిగ్బంధం. న్యాయబద్ధంగా అమెరికాకు చెందాల్సిన వెనిజులాలోని అపార చమురు నిల్వలు, భూములు, ఆస్తులు అన్నింటినీ మాకు అప్పగించేదాకా వదలం’ అని స్పష్టం చేశారు. 

గత నెలలో కూడా వెనిజులా తీర సమీపంలో ఆ దేశ చమురు నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ట్రంప్‌ తీరుపై వెనిజులా మండిపడింది. ‘ఒక సార్వభౌమ దేశంలోని ఆస్తులు, చమురు క్షేత్రాలు తమావేవని అంటారా? అంతర్జాతీయ చట్టాలను, స్వేచ్ఛా వాణిజ్య సూత్రాలను ట్రంప్‌ తుంగలో తొక్కుతున్నారు. దీనిపై ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేస్తాం’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. 
 

 ట్రంప్‌ అసలు ఉద్దేశం డ్రగ్స్, హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ కట్టడి కాదని స్వయానా ఆయన చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ సుసీ వైల్స్‌ స్పష్టం చేశారు. మాట వినని ఆ దేశాధ్యక్షుడు నికోలస్‌ మదురోను గద్దె దింపడమేనని ఆయన అసలు లక్ష్యమని కుండబద్దలు కొట్టారు! ఈ మేరకు వానిటీ ఫెయిర్‌ వైల్స్‌కు ఇచ్చిన సంచలనాత్మక ఇంటర్వ్యూ మంగళవారం ప్రచురితమైంది. మదురో కాళ్ళబేరానికి వచ్చి తప్పుకునేదాకా వెనిజులా చమురు నౌకలను పేల్చేస్తూనే ఉంటామని కూడా ఆయన స్పష్టం చేయడం విశేషం! వెనిజులాలో ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వకున్న విషయం తెలిసిందే. ఆ దేశం ఏకంగా రోజుకు 10 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తుంది. అక్కడి ఆర్థిక వ్యవస్థకు చమురు ఆదాయమే జీవనాడి.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)