Breaking News

ట్రంప్‌ మరో సంచలనం.. విద్యార్థి వీసా ఇంటర్వూలకు బ్రేక్‌

Published on Wed, 05/28/2025 - 07:13

వాషింగ్టన్‌: అమెరికాలో విద్యాభ్యాసానికి సంబంధించి విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపేయాలని డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయించింది. అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో అమెరికా వ్యతిరేక, హమాస్‌ అనుకూల భావజాలం పెరిగిపోతోందన్న ట్రంప్‌ ప్రభుత్వం ఆందోళనల నడుమ విదేశాంగ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక, ఇప్పటికే షెడ్యూలింగ్‌ అయిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను కొనసాగించవచ్చని, ఈరోజు నుంచి కొత్త ఇంటర్వ్యూలను షెడ్యూలింగ్‌ చేయొద్దని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలను మంగళవారం ఆదేశించారు. ఈ మేరకు అత్యయిక ఉత్తర్వుపై మార్కో రూబియో సంతకం చేశారు. విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందించిన వివరాలతో వారి సోషల్‌మీడియా అకౌంట్లలో అమెరికా వ్యతిరేక భావజాలం తాలూకు వివరాలను అమెరికా ఇమిగ్రేషన్‌ విభాగ నిపుణులు విశ్లేషించచనున్నారు. ఎఫ్, ఎం, జే కేటగిరీ దరఖాస్తుల సోషల్‌మీడియా ఖాతాల పాత పోస్ట్‌లు, వ్యాఖ్యానాలను అధికారులు నిశితంగా గమనించనున్నారు.

అమెరికా వ్యతిరేక ధోరణి ఎవరి సోషల్‌మీడియా ప్రొఫైల్, హిస్టరీలో కనిపిస్తే వారిని ఇంటర్వ్యూలదాకా రానివ్వకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. విదేశీ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో స్టూడెంట్‌ వీసాల జారీ ప్రక్రియ మరింత ఆలస్యంకానుంది. అంతర్జాతీయ విద్యార్థుల చేరిక, వారి ట్యూషన్‌ ఫీజులపై ఆధారపడిన పలు అమెరికా విశ్వవిద్యాలయాలకు ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. విదేశీ విద్యార్థుల అమెరికా కల సైతం కాస్తంత చెదిరిపోయే ప్రమాదం పొంచి ఉంది.  

క్లాసులు డుమ్మా కొడితే వీసా రద్దు.. 
ఇదిలా ఉండగా.. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరగతులకు డుమ్మా కొట్టినా లేక కోర్సులు మధ్యలో వదిలేసినా వీసా రద్దు కావడం ఖాయం. భవిష్యత్తులో వీసా కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం కూడా ఉండదు. విద్యాసంస్థకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా తరగతులకు గైర్హాజరు కావడం లేదా కోర్సును మధ్యలోనే వదిలేయడం వంటివి చేస్తే విద్యా వీసా రద్దవుతుందని ఇండియాలోని అమెరికా ఎంబసీ తేల్చి చెప్పింది. ఈ మేరకు మంగళవారం సోషల్‌ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. వీసా నిబంధనలకు ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది. అమెరికాలో చదువుకుంటున్న కాలంలో సమస్యలేవీ రాకుండా ఉండాలంటే స్టూడెంట్‌ స్టేటస్‌ కోల్పోకుండా జాగ్రత్తపడాలని పేర్కొంది. అమెరికాలో లక్షలాది మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతిఏటా వీరి సంఖ్య పెరుగుతోంది. 

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)