Breaking News

ట్రంప్‌కు కోపమొచ్చింది.. ఏం మాట్లాడుతున్నావ్‌ వెళ్లిపో అంటూ..

Published on Thu, 05/22/2025 - 08:52

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి కోపమొచ్చింది.  ప్రశ్నించిన ఓ విలేకరిపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఏం మాట్లాడుతున్నావ్‌?. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ ట్రంప్‌ చిందులు తొక్కారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

తాజాగా వైట్‌హౌస్‌లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా, ట్రంప్‌ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్‌కు ఖతార్‌.. విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా ప్రకటించిన విషయమై ట్రంప్‌ను ఎన్‌బీసీ ఛానెల్‌ విలేకరి ప్రశ్నించారు. సదరు విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ ఊగిపోయారు. అనంతరం, ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘నువ్వు ఏం మాట్లాడుతున్నావ్‌?. నువ్వు తెలివితక్కువ వాడివి. ఇక్కడ మేం మాట్లాడుతున్న దానికి, ఖతార్‌ విమానానికి సంబంధం ఏంటి? వాళ్లు విమానం ఇస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో. దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతి రైతుల సమస్యలు, హింస తదితర సమస్యల నుంచి దారి మళ్లించడానికే నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు. విలేకరిగా విధులు నిర్వహించే అర్హత నీకు లేదు’ అని ట్రంప్‌ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆ వార్తా సంస్థపై కూడా ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. దానిపై విచారణ జరపాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షడు ట్రంప్‌కు ఖతార్‌ పాలక కుటుంబం విలాసవంతమైన 747-8 జంబో జెట్‌ విమానాన్ని బహుమతిగా ఇవ్వనున్నట్లు  ప్రకటించింది. ఈ నేపథ్యంలో జంజో జెట్‌ విమానాన్ని స్వీకరించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. తాజాగా ఈ విమానం ట్రంప్‌ స్వీకరించడానికి అమెరికా రక్షణశాఖ కూడా ఆమోదం తెలిపింది. ఇక, దీనికి అధ్యక్ష విమానానికి (ఎయిర్‌ఫోర్స్‌ వన్‌) తగ్గట్టుగా కొన్ని హంగులు సమకూర్చనున్నారు. 2029 జనవరిలో పదవీవిరమణ చేసేవరకు ఈ విమానాన్ని ట్రంప్‌ ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’కు కొత్త వెర్షన్‌గా ఉపయోగించాలని ప్రణాళికలు చేస్తున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)