మైనార్టీల అణచివేత.. చైనాపై అమెరికా ఆగ్రహం

Published on Sat, 08/31/2024 - 07:28

న్యూయార్క్‌: జిన్‌జియాంగ్‌లో  ఉయిగర్‌ ముస్లింలు, ఇతర మైనార్టీల అణచివేతపై చర్యలు తీసుకోవాలని చైనాకు అమెరికా పిలుపునిచ్చింది. ఉయిగర్‌ ముస్లింలపై వివక్ష, అణచివేతను అంతం చేయాలని పేర్కొంది. జిన్‌జింయంగ్‌లో మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి నివేదిక విడుదలై రెండేళ్లు గడిచిన సందర్భంగా అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఉయిగర్‌ ముస్లింల విషయంలో ఇప్పటివరకు చైనా తీసుకుంటున్న చర్యలపై అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.

జిన్‌జియాంగ్‌లో చాలా దారుణంగా మానవ హక్కుల ఉల్లంఘటన జరుగుతోందని  ఐక్యరాజ్య సమితి 2022లో నివేదిక విడుదల చేసింది. రెండేళ్ల గడిచిన సందర్భంగా మాథ్యూ విల్లర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు.

 

‘‘చైనాలోని జిన్‌జియాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి హైకమిషనర్‌ నివేదిక విడుదల చేసి రెండేళ్లు పూర్తి అయింది. ఇ‍ప్పటికైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తక్షణ చర్యలు తీసుకోవాలి. ఉయిగర్‌ ముస్లింలు, ఇతర మైనార్టీల అణచివేతను అంతం చేయాలని కోరుతున్నాం’’ అని అన్నారు. అణచివేతకు గురువుతున్న వారిని విడుదల చేయాలని ఐక్యరాజ్య సమితి పిఫార్సులను చైనా అమలు చేయకపోవటంపై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుందని తెలిపారు. 

జిన్‌జియాంగ్‌లో ప్రధానంగా ముస్లిం ఉయిగర్లు ఇతర మైనారిటీలపై కొనసాగుతున్న అణచివేతపై అమెరికా తీవ్రంగా ఆందోళన చెందుతోందని అన్నారు. ఉయిగర్‌ ముస్లింలపై కొనసాగుతున్న అంతర్జాతీయ నేరాలు, మానవ హక్కులకు ఉల్లంఘనలు ముగింపు పలికేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని చైనాను మరోసారి కోరుతున్నామని మిల్లర్‌ అన్నారు.
 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)