Breaking News

వ్యతిరేక పోస్టులుంటే  నో వీసా, నో పర్మిట్‌

Published on Fri, 04/11/2025 - 05:22

వాషింగ్టన్‌: సోషల్‌ మీడియా ఖాతా చూస్తే వ్యక్తుల గురించి తెలిసిపోతుంది. అందుకే.. అమెరికా ఇమిగ్రేషన్‌ అధికారులు ఇప్పుడు దానిపై దృష్టి పెట్టారు. సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలించిన తరువాతే వీసాలు, నివాస అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. హమాస్, పాలస్తీనా ఇస్లామిక్‌ జిహాద్, లెబనాన్‌కు చెందిన హెజ్‌బొల్లా, యెమెన్‌కు చెందిన హౌతీలతో సహా ఉగ్రవాదులుగా అమెరికా వర్గీకరించిన గ్రూపులకు మద్దతుగా సోషల్‌ మీడియాలో పోస్టులుంటే వారికి అమెరికాలోకి ప్రవేశం లేదు. అమెరికా, ఇజ్రాయెల్‌ వ్యతిరేక పోస్టులుంటే వీసాలు, నివాస అనుమతులు నిరాకరిస్తామని తెలిపారు. 

ఈ విధానం తక్షణమే అమల్లోకి వస్తుందని హోంల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ ఏజెన్సీ అయిన యూఎస్‌ సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ తెలిపింది. అమెరికాలో ఉండేందుకు పర్మనెంట్‌ రెసిడెంట్‌ ‘గ్రీన్‌ కార్డుల’ కోసం దరఖాస్తు చేసేవారికీ ఇది వర్తిస్తుందని పేర్కొంది. విదేశీ ఉగ్రవాదాన్ని, యాంటీసెమిటిక్‌ ఉగ్రవాద సంస్థలు లేదా ఇతర యాంటీసెమిటిక్‌ కార్యకలాపాలను సమర్థించడం, ప్రోత్సహించడం లేదా మద్దతు ఇచ్చేవిగా సోషల్‌ మీడియా కంటెంట్‌ ఉంటే.. యూఎస్‌ ప్రతికూల అంశంగా పరిగణిస్తుందని ఏజెన్సీ తెలిపింది. ప్రపంచంలోని ఉగ్రవాద సానుభూతిపరులకు అమెరికాలో చోటు లేదని డీహెచ్‌ఎస్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ అసిస్టెంట్‌ సెక్రటరీ ట్రిసాయ మెక్లాఫ్లిన్‌ అన్నారు. మరోఅడుగు ముందుకేసి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే విద్యార్థులను ఉన్మాదులుగా అభివర్ణించారు.  

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)