Breaking News

తక్షణమే కాల్పుల విరమణకు కమలా హారిస్ పిలుపు

Published on Mon, 03/04/2024 - 08:10

గాజాలో ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు కొనసాగుతున్నాయి. యుద్ధం కారణంతో గాజాలో తీవ్ర ఆహార కోరత ఏర్పడింది. అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పందిస్తూ.. తక్షణమే గాజాలో కాల్పుల విరమణ చేపట్టాలని ఇజ్రాయెల్‌కు పిలుపునిచ్చింది. పాలస్తీనాలోని ప్రజలు అమానవీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని.. మానవతా సాయం పెంచాలని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేశారు.

అలబామాలోని సెల్మాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కమలా హారిస్‌.. ‘గాజాలోని ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అక్కడి పరిస్థితులు అమానవీయంగా ఉన్నాయి. మానవత్వం మమ్మల్ని చర్య తీసుకోవడానికి బలవంతం చేస్తోంది. గాజాలోని ప్రజలకు సహయం పెంచడానికి ఇజ్రాయెల్‌ ప్రభుత్వం కృషి చేయాలి’ అని కమలా హారిస్‌ అన్నారు.

‘హమాస్‌ కాల్పుల విరమణను కోరుకుంటుంది. కాల్పుల విరమణ  ఒప్పందానికి హమాస్‌ ఒప్పుకోవడానికి సిద్ధం ఉంది. కాల్పుల విరమణ డీల్‌ చేసుకోండి. బంధీలను వారి కుటుంబాలకు వద్దకు చేర్చండి. అదేవిధంగా  వెంటనే గాజా ప్రజలకు కూడా శాంతి, సాయం అందించండి’ అని  ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ తెలిపారు.

ఇక.. తమ వద్ద సజీవంగా ఉన్న ఇజ్రాయెల్‌ బంధీల పేర్లు వెల్లడించడానికి హమాస్‌ తిరస్కరించినట్లు ఇజ్రాయెల్‌ స్థానిక మీడియా పేర్కొంటోంది. ఆదివారం కైరోలో జరిగిన గాజా కాల్పుల విరమణ చర్చలను ఇ‍జ్రాయెల్‌ బాయ్‌కాట్‌ చేయటం గమనార్హం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)