Breaking News

ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం

Published on Fri, 04/18/2025 - 04:17

న్యూఢిల్లీ: అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలని కలలుగంటున్న భారతీ య విద్యార్థులకు మరిన్ని షాక్‌లు తగులుతున్నాయి. అమెరికా వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ స్లాట్లు ఆన్‌లైన్‌ నుంచి హఠాత్తుగా అదృశ్యమైపోతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. గత 20–25 రోజుల నుంచి వీసా అపాయింట్‌మెంట్‌ స్లాట్లు దొరకడం గగనంగా మారిందని అంటున్నారు. 

ఇండియా నుంచి అమెరికా వెళ్లడానికి వేలాది మంది విద్యార్థులు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోవైపు అమెరికా విద్యా సంస్థల్లో అడ్మిషన్ల సీజన్‌ డెడ్‌లైన్‌కు గడువు ముంచుకొస్తోంది. నిర్దేశిత గడువులోగా వీసాలు దొరక్కపోతే అడ్మిషన్‌పై ప్రభావం పడనుంది. అమెరికా వీసా కావాలంటే ఇండియాలోని యూఎస్‌ ఎంబసీలు లేదా కాన్సులేట్లలో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూల కోసం ముందుగానే ఆన్‌లైన్‌లో నగదు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. 

ఏప్రిల్‌ నెలకు సంబంధించిన స్లాట్లన్నీ ఇప్పటికే బుక్‌ అయిపోయాయి. మే, జూన్‌కు సంబంధించిన స్లాట్లు అందుబాటులో లేవని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఆన్‌లైన్‌లో కనిపించడం లేదని చెబుతున్నారు. కారణం ఏమిటో తెలియక అయోమయానికి గురవుతున్నారు. వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ స్లాట్ల కోసం నిత్యం వందలాది మంది ప్రయత్నిస్తున్నారు. కానీ, నిరాశే ఎదురవుతోంది. అమెరికా ఎంబసీ వీసా స్లాట్ల వ్యవస్థను అప్‌గ్రేడ్‌ చేస్తోందని, అందుకే ఈ సమస్య తలెత్తి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

వీసా స్లాట్ల వ్యవస్థను ఎవరూ దుర్వినియోగం చేయకుండా, అనధికారిక వ్యక్తులు ఇందులోకి ప్రవేశించకుండా పటిష్టమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. కానీ, దీనిపై అమెరికా ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం పట్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికిప్పుడు వీసాలు దొరకడం కష్టం కావడంతో అమెరికా వర్సిటీల్లో అడ్మిషన్లు వాయిదా వేసుకోవాలని కొందరు విద్యార్థులు భావిస్తున్నట్లు తెలిసింది.

భారతీయ విద్యార్థులకు సహకరిస్తాం: రణధీర్‌ జైశ్వాల్‌  
అమెరికాలో భారతీయుల వీసాలు హఠాత్తుగా రద్దు చేస్తుండడం, భారతీయ పర్యాటకులను అడ్డుకోవడం, హెచ్‌–1బీ వీసా ఉన్నవారికి ప్రవేశం నిరాకరిస్తుండడం వంటి సమస్యలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ గురువారం స్పందించారు. ఎఫ్‌–1 వీసాలను రద్దు చేస్తున్నామంటూ భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం నుంచి సమాచారం వస్తున్నట్లు తమకు తెలిసిందని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అసవరం లేదని, తగిన సహకారం అందిస్తామని చెప్పారు. అమెరికాలోని భారతీయ ఎంబీసీలు, కాన్సులేట్లు మన విద్యార్థులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)