కాల్పుల భయంలో అమెరికా..హడావిడి చేసిన యూనివర్సిటీ

Published on Sat, 04/08/2023 - 10:48

అమెరికాలో గతేడాది నుంచి వరుస కాల్పుల ఘటనలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ప్రజలు దుండగులు కాల్పుల భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక యూనివర్సిటీ సైతం కాల్పులు జరిగే అవకాశం ఉందంటూ హడావిడి చేసింది. అందుకోసం యూనివర్సిటీ ఎమర్జెన్సీ అలర్ట్‌ ప్రకటించి ట్విట్టర్‌ వేదికగా విద్యార్థులను అ‍ప్రమత్తం చేసింది కూడా. ఈ అనూహ్య ఘటన అమెరికాలోని నార్మన్‌లో ఉన్న ఓక్లహోమ్‌ యూనివర్సిటీలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే..ఓక్లహోమ్‌ యూనివర్సిటీలో ఓ సాయుధుడు కాల్పులు జరుపుతున్నాడని విద్యార్థులను అప్రమత్తంగా ఉండండి అంటూ యూనివర్సటీ అధికారులు ట్విట్టర్‌ వేదికగా సర్క్యూలర్‌ జారీ చేశారు. అత్యవసర పరిస్థితని కూడా ప్రకటించింది. పైగా క్యాంపస్‌లో విద్యార్థులు ఉంటే పరిగెత్తండి, దాక్కోండి లేదా ఆత్మరక్షణ కోసం ఫైట్‌ చేయండి అంటూ ‍ట్వీట్‌ చేసింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యూనివర్సిటీ మొత్తం సోదా చేయగా.. అలాంటిదేమీ లేదని తేలింది. వెంటనే యూనివర్సిటీ అధికారులు క్యాంపస్‌కి ఎలాంటి ముప్పు లేదంటూ ఆ హెచ్చరికను కూడా రద్దు చేసింది. ఇటీవలే నాషేవిల్లే పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులతో సహా ఒక ఉపాద్యాయుడు మృతి చెందిన కొద్దిరోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. గత కొంతకాలంగా కళాశాల, పాఠశాలల్లోనే కాల్పులు చోటు చేసుకోవడంతో ఈ తుపాకీ హింసతో అమెరికా వాసులు బెంబేలెత్తిపోతున్నట్లు తెలుస్తోంది.  

(చదవండి: పాక్‌ 2026 నాటికి చైనా, సౌదీ అరేబియాలకు రూ. 63 వేల కోట్లు చెల్లించాలి)


 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)