Breaking News

ఇరాన్‌పై యుద్ధానికి కౌంట్‌డౌన్?

Published on Sat, 02/21/2026 - 09:12

వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు  కమ్ముకుంటున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడి సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇరాన్‌పై భారీ వైమానిక దాడిని నివారించడానికి ఆ దేశానికి ఇదే ‘చివరి అవకాశం’ అని ఒక ఉన్నత స్థాయి ఇజ్రాయెల్ అధికారి పేర్కొన్నట్లు ఇజ్రాయెల్ మీడియా సంస్థ ‘ఛానల్ 12’ వెల్లడించింది. దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు సమయం మించిపోతోందని ఈ ప్రకటన తెలియజేస్తోంది.

ఈ హెచ్చరికల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా తన సైనిక వ్యూహాలను మరింత వేగవంతం చేసింది. ఇరాన్ నుండి ఎదురుదాడి జరిగే అవకాశం ఉందని భావిస్తూ, ఖతార్‌లోని అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం ‘అల్-ఉదైద్’ (Al-Udeid) నుంచి వందల మంది సైనికులను అమెరికా రహస్యంగా తరలిస్తోంది. కేవలం ఖతార్ మాత్రమే కాకుండా, ఇరాన్‌కు టార్గెట్‌గా మారే అవకాశాలున్న బహ్రెయిన్ లాంటి పొరుగు దేశాల్లోని స్థావరాల నుంచి కూడా సైనిక బలగాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

ఇరాన్‌పై ఇజ్రాయెల్ లేదా అమెరికా దాడి చేసిన మరుక్షణమే, ఇరాన్ తన క్షిపణులతో ఈ ప్రాంతంలోని అమెరికా బేస్‌లపై విరుచుకుపడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. గతంలో జరిగిన దాడుల దృష్ట్యా, ప్రాణనష్టం జరగకుండా ముందస్తుగా ఈ తరలింపు ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది. సైనికుల తరలింపు అనేది కేవలం రక్షణ చర్య మాత్రమే కాదని, ఇది రాబోయే పెద్ద సైనిక చర్యకు బలమైన సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) సమన్వయంతో అడుగులు వేస్తున్నాయి. ఇరాన్ గనుక తన అణు పంతాన్ని వీడకపోతే, ఏ క్షణమైనా పశ్చిమాసియాలో భారీ యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజులు ఈ ప్రాంతంలో అత్యంత కీలకం కానున్నాయి. ఎందుకంటే దౌత్యానికి ఇదే చివరి గడువు అంటూ ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా, అమెరికా పరోక్షంగా రష్యాను హెచ్చరించాయి.

ఇది కూడా చదవండి: ఆఫ్రికాలో రష్యా రహస్య ఆపరేషన్

#

Tags : 1

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)