Breaking News

Trump: యూఎస్‌ సుప్రీం కోర్టులో బిగ్‌ రిలీఫ్‌

Published on Tue, 07/02/2024 - 05:00

వాషింగ్టన్‌:  అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో దిగిన డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఊరట లభించింది. అధ్యక్షులకు న్యాయ విచారణ నుంచి కొంతమేరకు రక్షణ ఉంటుందని తొలిసారిగా అమెరికా సుప్రీంకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ‘రాజ్యాంగబద్ధమైన అధికార పరిధిలో తీసుకునే నిర్ణయాలకు మాజీ అధ్యక్షులకు క్రిమినల్‌ విచారణ నుంచి సంపూర్ణ రక్షణ ఉంటుంది. ఇది అధికారిక నిర్ణయాలకు మాత్రమే వరిస్తుంది. అనధికారిక చర్యలకు ఎలాంటి రక్షణ పొందలేరు’ అని చీఫ్‌ జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ మెజారిటీ తీర్పు(6–3)లో పేర్కొన్నారు. 

2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరించకుండా ఫలితాలను తారుమారు చేయడానికి కుట్ర పన్నారనే అభియోగాలపై డొనాల్డ్‌ ట్రంప్‌ క్రిమినల్‌ కేసును ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు సోమవారం ఈ కేసును తిరిగి ట్రయల్‌ కోర్టుకు అప్పగించింది. ఫలితంగా అధ్యక్ష ఎన్నిక జరిగే నవంబర్‌ 5 లోగా ట్రంప్‌ విచారణను ఎదుర్కొనే అవకాశాలు లేనట్టే. 

‘మాజీ అధ్యక్షులకు క్రిమినల్‌ విచారణ నుంచి మినహాయింపు అధ్యక్ష వ్యవస్థనే పునర్వవస్థీకరిస్తుంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదనే రాజ్యాంగ సూత్రాలను, భూమికను, ప్రభుత్వ వ్యవస్థను అవహేళన చేయడమే’ అని జస్టిస్‌ సోనియా సొటోమేయర్‌ అన్నారు. సుప్రీం తీర్పుపై ట్రంప్‌ హర్షం వ్యక్తం చేయగా.. అధ్యక్షుడు బైడెన్‌ ఈ తీర్పుపై స్పందిస్తారని వైట్‌ హౌజ్‌ వర్గాలు వెల్లడించాయి. అట్లాంటా బిగ్‌ డిబేట్‌ తర్వాత మళ్లీ బైడెన్‌ మీడియా ముందుకు రావడం ఇదే ప్రథమం.
 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)