Breaking News

శునకానికి డిప్లొమా డిగ్రీ: వీడియో వైరల్‌

Published on Sat, 05/27/2023 - 13:16

గ్రాడ్యుయేషన్‌ వేడుకలో యజమాని తోపాటు డిగ్రీ అందుకుని విస్మయపరిచింది ఓ శునకం. ఆ కుక్క తన యజమాని తోపాటు ప్రతి తరగతికి క్రమంత తప్పకుండా అటెండెంట్‌ అ‍య్యింది. దీంతో ఆ వేడుకలో స్టేజ్‌పై ఆ కుక్కకి డిప్లొమా డిగ్రీ అందజేసింది సదరు యూనివర్సిటీ.

వివరాల్లోకెళ్తే..యూఎస్‌లోని న్యూజెర్సీలోని సెటన్‌ హాల్‌ యూనివర్సిటీలో జరిగిన గ్రాడ్యుయేషన్‌ వేడుకలో జస్టిన్‌ అనే సర్వీస్‌ డాగ్‌ డిప్లోమా డిగ్రీని అందుకుని అందర్నీ ఆకర్షించింది. సెటన్‌ హాల్‌కి చెందని జోసెఫ్‌ నైర్‌ గ్రేస్‌ మరియాని, తన కుక్క జస్టిన్‌లు ఈ వేడుకలో డిగ్రీలను అందుకున్నారు. మరియాని బ్యాచిలర్‌ ఆప్‌ సైన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ డిగ్రీతో పట్టుభద్రురాలైంది.  ఆమె కుక్క యూనివర్సిటీలో ఉన్న అన్ని సమయాల్లో ఆమె పక్కనే ఉండి అన్ని తరగతులకు హజరయ్యి.. యజమాని పట్ల అచంచలమైన అంకితభావంతో పనిచేసింది.

అందుకు గాను గ్రాడ్యుయేషన్‌ వేడుకలో ఆమెకు డిప్లొమా డిగ్రీని ప్రధానం చేశారు. తన యజమాని మరియాని తోపాటు ఆ కుక్క అన్ని శిక్షణా తరుగుతుల్లో ఉండటం అనేది చాలా అరుదైన విషయం అని ప్రశంసిస్తూ యూనివర్సిటీ ఈ డిగ్రీని సదరు కుక్కకి బహుకరించింది. ఇక మరియాని తన కుక్క సహచర్యంతోనే ప్రాథమిక పాఠశాలలో భోదించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: శునకాన్ని ‍చిన్నపాటి కొమ్మతో అదిలించాడు..అంతే అది రెచ్చిపోయి...)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)