Breaking News

కరీబియన్‌ జలాల్లో అమెరికా మళ్లీ దాడి

Published on Sat, 10/25/2025 - 06:31

వాషింగ్టన్‌: కరీబియన్‌ సముద్ర జలాల్లో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఓ బోటుపై చేపట్టిన వైమానిక దాడిలో ఆరుగురు చనిపోయారని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ శుక్రవారం తెలిపారు. వీరంతా వెనిజులా జైలు నుంచి నడుస్తున్న ట్రెన్‌ డె అరాగ్వా గ్యాంగ్‌కు చెందిన వారేనన్నారు. 

ఈ ప్రాంతంలోని నార్కో– టెర్రరిస్ట్‌ డ్రగ్స్‌ రవాణాదారులను అల్‌ఖైదా ఉగ్రవాదులుగానే భావిస్తామన్నారు. వారిని వెంటాడి వేటాడి చంపుతామని హెగ్సెత్‌ హెచ్చరించారు. తాజా ఘటనతో సెపె్టంబర్‌ నుంచి ఆ ప్రాంతంలో అమెరికా చేపట్టిన దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 43కు చేరుకుంది. ఇలా ఉండగా, దక్షిణ అమెరికా ప్రాంతంలోకి విమాన వాహక నౌకను పంపిస్తున్నట్లు రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ తెలిపారు. 

గురువారం అమెరికా సైనిక సూపర్‌సోనిక్‌ హెవీ బాంబర్లు రెండు వెనిజులా తీరం వెంబడి చక్కర్లు కొట్టాయి. కరీబియన్‌ సముద్రం, వెనిజులా తీర వెంబడి అమెరికా బలగాల అసాధారణ మోహరింపులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో నార్కో టెర్రరిజమ్‌ ఆరోపణలను ఎదుర్కొంటున్న వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోను గద్దె దించే లక్ష్యంతోనే ఇవన్నీ చోటుచేసుకుంటున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. డ్రగ్స్‌ రవాణా ఒక కారణం మాత్రమే కాగా, ఆయా దేశాలను బెదిరించి దారికి తెచ్చుకోవడమే అమెరికా అసలు లక్ష్యమని పరిశీలకులు అంటున్నారు. 
 

Videos

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..!

LIVE: YSRకు జగన్ నివాళులు

దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి

ఇరుముడి OTTలోకి ఎప్పుడు.?

లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం

Kapra Lake: గణేష్ విగ్రహాల నిమజ్జనంపై వివాదం..

తెనాలిలో వ్యాపారి కిడ్నాప్ కేసు విషాదాంతం

చంద్రబాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు హెచ్చరిక

సభలో అందరిముందు జనసేన గాలి తీసిన బాబు..

Idupulapaya: YSR ఘాట్‌ వద్ద జగన్‌ నివాళులు

Photos

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)