Breaking News

హెచ్‌1బీ వీసా ఇంటర్వ్యూలు వాయిదా 

Published on Thu, 12/11/2025 - 04:52

న్యూఢిల్లీ: హెచ్‌1బీ వీసా ఇంటర్వ్యూలను హఠాత్తుగా వాయిదా వేయడంతో వేలాది మంది భారతీయ దరఖాస్తుదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెలలో జరగాల్సిన ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లు అమెరికా ఇమిగ్రేషన్‌ వర్గాలు వెల్లడించాయి. దరఖాస్తులదారులకు ఈ–మెయిల్‌ ద్వారా సమాచారం చేరవేశాయి. ఇంటర్వ్యూలు మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 

హెచ్‌1బీ వీసా దరఖాస్తుదారుల సోషల్‌ మీడియా ఖాతాల ప్రొఫైల్స్‌ను, సోషల్‌ మీడియాలో వారు చేసిన పోస్టులను క్షుణ్నంగా తనిఖీ చేయాలంటూ అమెరికా ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అనుమానాస్పద, అభ్యంతరకరమైన పోస్టులు చేసినట్లు తేలితే వీసా లభించదని డొనాల్డ్‌ ప్రభుత్వం పరోక్షంగా స్పష్టంచేసింది. ప్రొఫైల్స్‌ సైతం అనుమానాస్పదంగా ఉంటే వీసా ఇంటర్వ్యూకు పిలుపు రాకపోవచ్చు. 

తాజా ఆదేశాల నేపథ్యంలోనే భారత్‌లో హెచ్‌1బీ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ నెలలో జరగాల్సిన ఇంటర్వ్యూలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలల్లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. అమెరికా నుంచి ఇండియాకు వచ్చినవారు ఇప్పటికిప్పుడు తిరిగి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. హెచ్‌1బీ వీసా ఇంటర్వ్యూ వెంటనే జరగకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. వారు మరో నాలుగైదు నెలలపాటు వేచి చూడక తప్పదు. 

హెచ్‌1బీ మాత్రమే కాకుండా ఇతర వీసాల ఇంటర్వ్యూలను సైతం వాయిదా వేస్తున్నారు. సోషల్‌ మీడియా పోస్టులను, ప్రొఫైళ్లను తనిఖీ చేసిన తర్వాత వారికి ఇంటర్వ్యూ పిలుపులు రావొచ్చు. వీసా దరఖాస్తుదారులెవరూ కాన్సులర్‌ కార్యాలయాలకు రావొద్దని అమెరికా ఎంబసీ సూచించింది. కొత్త అపాయింట్‌మెంట్‌ తేదీ కోసం వేచి చూడాలని స్పష్టంచేసింది. 

ఇంటర్వ్యూలు వాయిదాపడిన దరఖాస్తుదారులు సోషల్‌ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీన జరగాల్సిన ఇంటర్వ్యూ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30వ తేదీకి వాయిదా పడిందని ఓ యువకుడు వాపోయాడు. ఇదిలా ఉండగా, ఇంటర్వ్యూలను వాయిదా వేయడాన్ని అమెరికా కంపెనీలు తప్పుపడుతున్నాయి. నైపుణ్యం కలిగిన మానవ వనరులు దూరమయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నాయి.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)