Breaking News

హమాస్‌ను నిర్మూలించాల్సిందే 

Published on Mon, 02/17/2025 - 05:04

జెరూసలేం: హమాస్‌ను గాజా నుంచి తుడిచిపెట్టాల్సిందేనని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్‌ రుబియో స్పష్టం చేశారు. సైనికపరమైన లేదా ప్రభుత్వాన్ని నడిపే శక్తిగా హమాస్‌ ఎంతమాత్రం కొనసాగనివ్వబోమని చెప్పారు. ఆదివారం ఆయన ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వంగా, పరిపాలనా శక్తిగా, హింసకు పాల్పడతామంటూ బెదిరించే వ్యవస్థగా హమాస్‌ ఉన్నంత కాలం శాంతి నెలకొనడం అసాధ్యం. 

అందుకే హమాస్‌ను నిర్మూలించకతప్పదు’’ అని కుండబద్దలు కొట్టారు. హమాస్‌పై పోరుకు అరబ్‌ దేశాల సాయం కూడా కోరుతామన్నారు. ఎవరూ ముందుకు రాకుంటే సొంతంగా ఇజ్రాయెలే ఆపని పూర్తి చేస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో హమాస్, ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల ఒప్పందం కొనసాగడంపై అనుమానంగా మారింది. దాని గడువు రెండు వారాల్లో ముగియనుంది. రెండో దశలో మిగతా బందీలను హమాస్‌ విడుదల చేయాల్సి ఉండటం తెలిసిందే. ఇజ్రాయెల్‌ సైన్యం ఆదివారం గాజాపై దాడులకు దిగింది. వీటిలో తమ ముగ్గురు పోలీసులు చనిపోయినట్లు హమాస్‌ తెలిపింది.
 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)