Breaking News

అరుణాచల్‌ భారత్‌దే: అమెరికా

Published on Fri, 03/22/2024 - 04:39

వాషింగ్టన్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌ను భారత్‌కు చెందిన ప్రాంతంగానే గుర్తిస్తున్నామని అమెరికా ప్రకటించింది. వాస్తవా«దీన రేఖ(ఎల్‌ఏసీ) ఆవలి వైపు ప్రాంతం కూడా తమదేనంటూ చైనా సైన్యం కానీ, పౌరులు గానీ ఏకపక్షంగా అక్రమంగా చొరబాట్లకు పాల్పడేందుకు చేసే ప్రయత్నాలను గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు అగ్రరాజ్యం తెలిపింది.

ఇటీవల ప్రధాని మోదీ అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యటించిన నేపథ్యంలో చైనా ఆర్మీ మరో మారు ఆ భూభాగం తమదేనంటూ ప్రకటించడంపై అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్‌ ఉప అధికారప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ మీడియాకు ఈ విషయం తెలిపారు. భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్‌ను టిబెట్‌లోని ‘జాంగ్నాన్‌’గా చైనా తరచూ పేర్కొంటోంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన భారత్‌..అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎల్లప్పుడూ తమదేనని, ఇకపైనా విడదీయరాని అంతర్భాగంగానే కొనసాగుతుందని బుధవారం పునరుద్ఘాటించిన విషయం తెలిసిందే.

అమెరికాకు సంబంధం లేదు:చైనా
అరుణాచల్‌ భారత్‌దేనంటూ అమెరికా చేసిన ప్రకటనను చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. భారత్‌–చైనా సరిహద్దు  వివాదంతో అమెరికాకు ఏమాత్రం సంబంధం లేదని తెలిపింది. అమెరికా ఇతర దేశాల మధ్య వివాదాలను రెచ్చగొడుతూ, వాటిని తన స్వార్థ భౌగోళిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం అందరికీ తెలిసిందేనని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్‌ జియాన్‌ వ్యాఖ్యానించారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)