Donald Trump: మళ్లీ ఎన్నికైతే నియంతలా పరిపాలిస్తా

Published on Fri, 01/12/2024 - 06:11

వాషింగ్టన్‌:  అమెరికా అధ్యక్షుడిగా తాను మళ్లీ ఎన్నికైతే ఒక నియంత తరహాలో పరిపాలన సాగిస్తానని మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. తనకు రెండు లక్ష్యాలు ఉన్నాయని, వాటిని నెరవేర్చవడానికి అవసరమైతే నియంతలా మారుతానని స్పష్టం చేశారు. మెక్సికో సరిహద్దు నుంచి నుంచి అమెరికాలోకి చొరబాట్లను అరికట్టడం, ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రోత్సాహం ఇవ్వడం తన లక్ష్యాలు అని వివరించారు.  తనపై తప్పుడు ప్రచారం సాగిస్తూ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ట్రంప్‌ మండిపడ్డారు.

ఒకవేళ తనపై అక్రమ కేసులు నమోదు చేసి, విచారణ చేపడితే అమెరికా మొత్తం స్తంభించిపోతుందని తేల్చిచెప్పారు. తనను నియంతగా చిత్రీకరించి, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అధ్యక్షుడిగా అధికారంలో తాను యుద్ధాలు చేయలేదని, విదేశాల్లో ఉన్న అమెరికా దళాలను వెనక్కి రప్పించానని గుర్తుచేశారు. జో బైడెన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇతర దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ యుద్ధాల నుంచి రాజకీయంగా లాభం పొందాలని బైడెన్‌ ఎత్తుగడలు వేస్తున్నారని ట్రంప్‌ ధ్వజమెత్తారు. 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)