Breaking News

US presidential election 2020 Case: ట్రంప్‌ అరెస్ట్‌.. విడుదల

Published on Sat, 08/26/2023 - 04:41

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ చరిత్ర సృష్టించారు. ఫొటో సహా పోలీసుల రికార్డుల్లోకి ఎక్కిన తొలి మాజీ అధ్యక్షుడయ్యారు. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో జార్జియాలో ఫలితాల తారుమారుకు యత్నించారన్న ఆరోపణల కేసులో ట్రంప్‌(77) గురువారం జార్జియాలోని ఫుల్టన్‌ కౌంటీ జైలులో అధికారుల ఎదుట లొంగిపోయారు. ఈ సమయంలో అధికారులు మగ్‌ షాట్‌ తీశారు.

అమెరికా చరిత్రలో మాజీ అధ్యక్షుడి మగ్‌ షాట్‌ తీయడం ఇదే మొదటిసారి. ఆరడుగుల 3 అంగుళాల ఎత్తు, 97 కిలోల బరువు, స్ట్రాబెర్రీ రంగు జుట్టు, నీలం కళ్లు..అంటూ ట్రంప్‌ వివరాలను జైలు అధికారులు నమోదు చేశారు. ఆయనకు ఖైదీ నంబర్‌ పి01135809 కేటాయించారు. 22 నిమిషాల సేపు జైలులో గడిపిన ట్రంప్‌ రెండు లక్షల డాలర్ల బెయిల్‌ బాండ్‌పై విడుదలయ్యారు. అంతకుముందు, విమానంలో అట్లాంటా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ట్రంప్‌ను భారీ బందోబస్తు మధ్య ఫుల్టన్‌ కౌంటీ కోర్టుకు తీసుకొచ్చారు.

ఫెడరల్, రాష్ట్ర అధికారులు నమోదు చేసిన వివిధ నేరారోపణలకు గాను ట్రంప్‌ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నాలుగుసార్లు లొంగిపోయారు. మగ్‌ షాట్‌ తీయడం మాత్రం ఇదే తొలిసారి. మగ్‌ షాట్‌ ఫొటోను ట్రంప్‌ తన సొంత ‘ట్రూత్‌ సోషల్‌’తోపాటు ‘ఎక్స్‌’ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఎన్నికల్లో జోక్యం..ఎన్నటికీ లొంగను అంటూ వ్యాఖ్యానించారు. ఫుల్టన్‌ కౌంటీ జైలు అధికారులు విడుదల చేసిన ట్రంప్‌ మగ్‌ షాట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. విడుదలైన అనంతరం ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. తానెలాంటి తప్పు చేయలేదని చెప్పుకున్నారు. అమెరికాకు ఇది చెడు దినమని వ్యాఖ్యానించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)