Breaking News

బిగ్‌ డిబేట్‌లో బైడెన్‌ బేజారు!.. ‘నేనేం కుర్రాడిని కాదుగా’

Published on Sat, 06/29/2024 - 10:18

వాషింగ్టన్‌: వాడీవేడిగా సాగిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(81), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(78)ల చర్చ యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. నువ్వు అబద్ధాలకోరువంటే.. నువ్వే అబద్ధాలకోరువంటూ మాటల దాడి చేసుకున్నారు ఈ ఇద్దరూ. అయితే డిబేట్‌లో ట్రంప్‌ పైచేయి సాధించారంటూ బైడెన్‌ డెమొక్రటిక్‌ సహచరులు సైతం అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

ట్రంప్‌తో సాగిన డిబేట్‌లో తన ప్రదర్శపై అధ్యక్షుడు బైడెన్‌ శుక్రవారం స్పందించారు. ‘‘స్పష్టంగా చెప్పాలంటే.. నేను కుర్రాడిని కాదనే విషయం నాకు తెలుసు. అలాగని నడకలోనూ, మాటల్లోనూ, చర్చల్లోనూ అంత తేలికగా వ్యవహరించను. నేను ఈ బాధ్యతను(అధ్యక్ష పదవి) మళ్లీ సమర్థవంతంగా నిర్వహించగలనని మనసారా, ఆత్మ సాక్షిగా నమ్మాను. కాబట్టే మళ్లీ బరిలో నిలుచున్నా. ఏది ఏమైనా.. అధ్యక్ష రేసు నుంచి తప్పుకునేది లేదు. రిపబ్లికన్‌ ప్రత్యర్థి ట్రంప్‌ను ఓడించి తీరతా’’ అని బైడెన్‌ అన్నారు.

దేశాధ్యక్ష పీఠం కోసం డెమొక్రటిక్‌ పార్టీ నుంచి బైడెన్, రిపబ్లికన్ల తరఫున ట్రంప్‌ బరిలో ఉన్న సంగతి తెలిసిందే.  అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి(భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం) జరిగిన డిబేట్‌లో  పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి వీరిద్దరి మధ్య ఇదే తొలి ముఖాముఖి చర్చ.  దేశ ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు, విదేశాంగ విధానం, గర్భవిచ్ఛిత్తి తదితర అంశాలపై ఒకరికొకరు ప్రశ్నలు సంధించుకొని.. దాదాపు 90 నిమిషాలపాటు ఆరోపణలు గుప్పించుకున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)