Breaking News

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా

Published on Thu, 07/18/2024 - 06:55

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో తెలియజేశారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ కూడా బైడెన్‌ ఆరోగ్య వివరాలను తెలియజేశారు. జో బైడెన్‌ తన సోషల్ మీడియా ఖాతాలోలో ఇలా రాశారు. ‘ఈ రోజు మధ్యాహ్నం నేను కోవిడ్ -19 టెస్టులు చేయించుకున్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. నా శ్రేయస్సు కోరుకునేవారందరికీ ధన్యవాదాలు. నేను అనారోగ్యం నుంచి కోలుకునేవరకూ అందరికీ దూరంగా ఉంటాను. ఈ సమయంలోనూ అమెరికా ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాను’అని పేర్కొన్నారు.

 

 బైడెన్‌కు చికిత్స అందిస్తున్న వైద్యుడు కెవిన్ ఓ కానర్ మాట్లాడుతూ బైడెన్‌ ప్రస్తుతం ముక్కు కారటం, దగ్గు వంటి తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నారన్నారు. అలసిపోయినట్లు కనిపిస్తున్నారని కూడా తెలిపారు. కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన దరిమిలా బైడెన్‌కు యాంటీ వైరల్ డ్రగ్ పాక్స్‌లోవిడ్  మొదటి డోస్ అందించాం. బైడెన్‌ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం ఇస్తూనే ఉంటామని తెలిపారు.

 

 

లాస్ వెగాస్‌లో జరిగిన ఒక సదస్సులో ప్రసంగానికి ముందు బైడెన్‌కు కరోనా టెస్ట్‌ చేశారు. ఈ రిపోర్టుల ఆధారంగా ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ మీడియాతో మాట్లాడుతూ జో బైడెన్‌  ప్రస్తుతం కరోనాలోని తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఆయన డెలావేర్‌కు చేరుకుని కరోనా తగ్గేవరకూ ఒంటరిగా ఉంటారన్నారు.

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)