Breaking News

కాళ్ల వద్ద వాపు.. చేతి వద్ద గాయం..!

Published on Sat, 07/19/2025 - 05:49

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(80) ఆరోగ్యంపై మరోసారి వదంతులు చెలరే గాయి. ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఫిపా క్లబ్‌ వరల్డ్‌ కప్‌ తిలకించేందుకు వచ్చిన ట్రంప్‌నకు కాళ్ల వద్ద నరాలు ఉబ్బిపోయినట్లుగా కనిపించడం, కుడి చేతిపై పలు చోట్ల వాపు కనిపించడంపై పలు దృశ్యాలు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేశాయి. ట్రంప్‌ వాస్తవ ఆరోగ్య స్థితిని కప్పిపుచ్చేందుకు అధ్యక్ష యంత్రాంగం ప్రయత్నిస్తోందా? అంటూ ఎక్స్‌లో ఓ యూజర్‌ అనుమానం వ్యక్తం చేశాడు. 

అధ్యక్షుడు ట్రంప్‌ శ్వాస సంబంధ సమస్యతో బాధపడు తున్నట్లుగా మరికొందరు నెటిజన్లు పేర్కొన్నారు. ఇలా వస్తున్న రకరకాల వదంతులపై అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ స్పందించారు. వీన్స్‌ ఇన్‌సఫియెన్సీ అనే సిరల వ్యాధితో ట్రంప్‌ బాధపడుతున్నారన్నారు. 70 ఏళ్లు దాటిన వారిలో సాధారణంగా కనిపించేదేనని చెప్పారు. ‘ట్రంప్‌ కాళ్ల దిగువ భాగంలో, చీలమండ వద్ద వాపును వైద్యులు పరీక్షించారు. దీన్ని సాధారణ లోపంగా నిర్ధారించారు. భయపడాల్సిన అవసరం లేదన్నారు’అని ఆమె తెలిపారు. ఇతర వైద్య పరీక్షల్లో గుండె వైఫల్యం, కిడ్నీ వైఫల్యం వంటివి లేనట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. 
 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)