Breaking News

యాపిల్‌కు ట్రంప్‌ అల్టిమేటం

Published on Sat, 05/24/2025 - 02:36

వాషింగ్టన్‌: ఐఫోన్లను అమెరికాలోనే తయారు చేయాలంటూ యాపిల్‌ కంపెనీపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరింతగా ఒత్తిడి పెంచారు. భారత్‌తో సహా మరెక్కడ ఉత్పత్తి చేసినా 25 శాతం దిగుమతి సుంకం తప్పదంటూ తాజాగా అల్టిమేటం జారీ చేశారు. ‘‘అమెరికాలో విక్రయించే ఐఫోన్లను ఇక్కడే తయారు చేయాలని యాపిల్‌ చీఫ్‌ టిమ్‌ కుక్‌కు ఎప్పుడో చెప్పా. భారత్‌లోనో, మరో దేశంలోనే తయారు చేస్తామంటే కుదరదని స్పష్టం చేశా. కానీ ఆయన వినడం లేదు. అందుకే యాపిల్‌ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌ విధించాలని నిర్ణయించా’’ అని శుక్రవారం తన సొంత ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా ట్రంప్‌ వెల్లడించారు. 

టారిఫ్‌ల భారాన్ని తగ్గించుకునేందుకు ఐఫోన్ల తయారీని చైనా నుంచి భారత్‌కు మార్చాలని కుక్‌ నిర్ణయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఇలా టారిఫ్‌ బాంబు పేల్చారు. గత వారం పశ్చిమాసియాలో పర్యటన సమయంలోనే ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించడం తెలిసిందే. అమెరికా నిర్ణయంతో ఐఫోన్ల ధరలకు రెక్కలొచ్చే అవకాశం కన్పిస్తోంది. అదే జరిగితే ఫోన్ల అమ్మకాలు పడిపోయి సంస్థ లాభాలపై ప్రభావం పడనుంది. ట్రంప్‌ టారిఫ్‌లతో తలెత్తిన అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు ఎలా స్పందించాలో తెలియక అమెజాన్, వాల్‌మార్ట్‌ వంటి దిగ్గజ కంపెనీలన్నీ ఇప్పటికే అయోమయంలో పడ్డాయి.

ఈయూపై 50% బాదుడు
యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) పైనా ట్రంప్‌ మరోసారి టారిఫ్‌ల కొరడా ఝళిపించారు. ఈయూతో అమెరికా వాణిజ్య చర్చలు సజావుగా సాగడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జూన్‌ 1 నుంచి అన్ని రకాల ఈయూ ఉత్పత్తులపైనా 50 శాతం టారిఫ్‌ అమల్లోకి రానుందని ‘ట్రూత్‌ సోషల్‌’లో ప్రకటించారు. అమెరికాలో తయారు చేసే వస్తువులపై ఎలాంటి టారిఫ్‌లూ ఉండవని సెలవిచ్చారు. ఈయూ దిగుమతులపై 10% పన్ను కొనసాగాలని ట్రంప్‌ పట్టుబడుతుండగా పూర్తిగా ఎత్తేయాలని ఈయూ కోరుతోంది. ఈ సమయంలో ఆయన ఉన్నట్టుండి ఇలా టారిఫ్‌ బాంబు పేల్చారు. చైనా మీదా ఇలాగే టారిఫ్‌లను ఆయన 145 శాతానికి తీసుకెళ్లడం, చివరికి 30 శాతానికి తగ్గించడం తెలిసిందే. 


 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి