బీబీసీపై ట్రంప్‌ పరువు నష్టం దావా

Published on Wed, 12/17/2025 - 04:15

వాషింగ్టన్‌:  అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పరువు నష్టం దావా వేశారు. 2021లో కేపిటల్‌ హిల్‌ దాడి సమయంలో తన ప్రసంగాన్ని దురుద్దేశంతో తప్పుగా, రెచ్చగొట్టేవిధంగా బీబీసీ ప్రసారం చేసిందని ఆయన ఆరోపించారు. అందుకుగాను సంస్థ 10 బిలియన్‌ డాలర్లు (రూ.90వేల కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు.. 2024 అధ్యక్ష ఎన్నికల్లోనూ జోక్యం చేసుకోవడానికి, ప్రభావితం చేయడానికి ప్రయతి్నంచిందన్నారు. ఈ మేరకు 33 పేజీలతో మయామి ఫెడరల్‌ కోర్టులో దావాను వేశారు.

2021 జనవరి 6న తేదీన అధ్యక్ష ఎన్నికల ఫలితాల సమయంలో కేపిటల్‌ హిల్‌పై దాడికి ముందు తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్‌ గంటపాటు మాట్లాడారు. ఈ సందర్భంగా ‘కేపిటల్‌ హిల్‌కు వెళ్తున్నాం. నేనూ మీతోపాటు వస్తున్నాం. మనం పోరాడదాం’అన్నట్టుగా ఉన్న ప్రసంగాన్ని బీబీసీ ‘పనోరమ’డాక్యుమెంటరీగా ప్రసారం చేసింది. అయితే రెండు వేర్వేరు భాగాలను ఎడిట్‌ చేసి, కలిపి ప్రసారం చేశారని ట్రంప్‌ ఆరోపించారు. తాను మాట్లాడని విషయాలను మాట్లాడినట్లుగా ప్రసారం చేసినందుకు బీబీసీపై దావా వేస్తున్నట్లు చెప్పారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)