Breaking News

ఆకాశం నిర్మలంగా ఉన్నా ప్రమాదం ఎలా జరిగింది?.. ట్రంప్‌ సందేహం

Published on Thu, 01/30/2025 - 12:50

వాషింగ్టన్: వాషింగ్టన్ విమాన ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఇలా జరగడం మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆకాశం నిర్మలంగా ఉన్నప్పటికీ ఈ ప్రమాదం ఎలా జరిగింది? అని ట్రంప్‌ ప్రశ్నించారు.

హెలికాప్టర్ విమానం వైపు  ముందుకు ఎలా వెళ్లిగలిగింది? అది పైకి,  కిందకు లేదా మరొక వైపుకు ఎందుకు తిరగలేదు? అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(US President Trump) పలు సందేహాలను వ్యక్తం చేశారు. వాషింగ్టన్‌లోని వైట్ హౌస్ సమీపంలో కెనడియన్ ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయింది. ఆ విమానం అమెరికాలోని కాన్సాస్ సిటీ నుంచి వాషింగ్టన్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం దరిమిలా విమానం పోటోమాక్ నదిలో పడిపోయింది.

ఆ విమానంలో 60 మంది ఉన్నారు. ఇప్పటివరకు 18 మృతదేహాలను నది నుంచి బయటకు తీశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ట్రంప్ వైట్ హౌస్‌లో ఉన్నారు. వైట్ హౌస్‌(White House)కు విమానాశ్రయం మధ్య దూరం మూడు కిలోమీటర్ల కంటే తక్కువే. ఆ విమానం ఢీకొన్న హెలికాప్టర్ అమెరికా ఆర్మీకి చెందిన బ్లాక్‌హాక్ హెలికాప్టర్ (H-60). రోనాల్డ్ రీగన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కావడానికి కొద్దిసేపటి ముందుగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన నేపధ్యంలో రీగన్ జాతీయ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి విధించారు. ఈ వైమానిక సంఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ), జాతీయ రవాణా భద్రతా బోర్డు (ఎన్‌టీఎస్‌బీ) దర్యాప్తు చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: అమెరికాలో విమాన ప్రమాదం.. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)