భారత ఎన్నికల ప్రక్రియపై అమెరికా ప్రశంసలు

Published on Wed, 06/05/2024 - 12:33

వాషింగ్టన్‌: భారత్‌లో మంగళవారంవ వెల్లడైన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. భారత దేశ పార్లమెంటరీ ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్య చరిత్రలోనే చాలా పెద్దదని అమెరికా ప్రశంసలు కురిపించింది. అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ మీడియాతో మాట్లాడారు.

‘‘ భారత ప్రభుత్వం,  దేశంలోని ఓటర్లు అతిపెద్ద ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.   ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచారు?. ఎవరు ఓడిపోయారు? అనే అంశంపై మాకు ప్రాధాన్యం కాదు. వాటి మేము వ్యాఖ్యలు చేయటం లేదు. 

గత ఆరు వారాలను నుంచి ప్రజాస్వామ్య చరిత్రలోనే చాలా పెద్దదైన ఎన్నికలు ప్రక్రియ భారత్‌లో జరగటం చూశాం. అదే మాకు చాలా ముఖ్యం’ అని మాథ్యూ మిల్లర్‌ అన్నారు. 

ఇక.. ఏడు విడతలుగా జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫతితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ 242 స్థానాలు గెలుపొందింది. ఇక.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కేటమి 294 స్థానాలు విజయం సాధించింది. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశంలో మూడోసారి అధికారం చేపట్టనుంది. ​ మరోవైపు.. ప్రతిపక్షాల ఇండియా కూటమి 232 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)