Breaking News

ఇండో-అమెరికన్లను ప్రసన్నం చేసుకునేందుకు..

Published on Wed, 09/04/2024 - 14:56

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల  ప్రచారం జోరుగా కొనసాగుతోంది. రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌, ఉపాధ్యక్షురాలు.. డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ ప్రచార వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో నవంబర్‌ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో భారతీయ అమెరికన్ల ఓటర్ల అధిక సంఖ్యలో పాల్గొనేలా కొన్ని స్వ‍చ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి.

అందులో భాగంగానే ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (FIIDS) సంస్థ ‘ఇండో అమెరికన్ వోట్స్ మేటర్’ అనే ప్రచారాన్ని మంగళవారం ప్రారంభించింది. అమెరికా భవిష్యత్తును రూపొందించడంలో  ఇండియన్‌ అమెరికన్లు కీలక పోషిస్తారని ఓ ప్రకటనలో తెలిపింది.

‘‘ఇండో అమెరికన్లు అమెరికాలో శక్తివంతమైన, పెరుగుతున్న మైనారిటీ కమ్యూనిటీగా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. అమెరికాగా అంతటా సుమారుగా 4.5 మిలియన్ల మంది ఇండో అమెరికన్లు ఉన్నారు. 2024 ఎన్నికలలో ఇండో అమెరికన్‌ ఓటర్లు గణనీయమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఫ్లోరిడా, జార్జియా, అరిజోనా, వర్జీనియా, న్యూజెర్సీ , పెన్సిల్వేనియా వంటి కీలకమైన రాష్ట్రాలలో ఇండో అమెకన్లు  అధిక సంఖ్యలో ఉన్నారు. కీలకమైన అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలను నిర్ణయించడంలో ఇండో అమెరికన్లు నిర్ణయాత్మకంగా మారనున్నారు’’ అని ఎఫ్‌ఐఐడీఎస్‌ పేర్కొంది. 

ఎన్నికల నేపథ్యంలో దేశీయంగా అమెరికా, ప్రపంచం విధానాలపై ఇండో అమెరికన్ల అభిప్రాయలు తెలుసుకోవడానికి సమగ్ర సర్వే చెపడుతున్నామని తెలిపారు. ‘అధ్యక్ష ఎన్నికలకు కీలకమైన రాష్ట్రాల్లో ఇండో అమెరికన్‌ జనాభా గణనీయంగా ఉంది. ఈ అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు ప్రభావం చూపే అవకాశం కలిగి ఉన్నారు’ అని ఎఫ్‌ఐఐడీఎస్‌ పాలసీ అండ్ స్ట్రాటజీ చీఫ్ ఖండేరావ్ కాండ్ తెలిపారు.

ఇక.. భారతీయు అమెరికన్లు ఈసారి ఏ పార్టీ అభ్యర్థివైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి. మరోవైపు.. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా ఇండో అమెరికన్‌  కమలా హారిస్‌ బరిలో ఉండటంతో భారతీయ అమెరికన్ల ఓటర్లపై ప్రాధాన్యత పెరుగుతోంది.

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)