Breaking News

‘గాజా యుద్ధ ముగింపునకు అత్యుత్తమ మార్గమిదే!’

Published on Mon, 06/17/2024 - 07:32

వాషింగ్టన్‌: హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంతో నిత్యనరకం చూస్తున్న ఇస్లాం పౌరులు.. ఇకనైనా ప్రశాంతంగా జీవించాల్సిన అవసరం ఉంది. యుద్ధం ముగిస్తేనే అది సాధ్యపడుతుంది. అందుకు అమెరికా ప్రతిపాదించిన కాల్పుల ఉల్లంఘన ఒప్పందం ఒక్కటే అత్యుత్తమ మార్గమని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆదివారం బక్రీద్‌(Eid ul Adha) సందేశం విడుదల చేశారు. ‘‘గాజా యుద్ధంతో ఎందరో అమాయకులు చనిపోయారు. అందులో వేల మంది చిన్నారులు ఉన్నారు. తమ కళ్ల ముందే తమ వాళ్లను పొగొట్టుకుని.. సొంత ప్రాంతాల నుంచి పారిపోయిన ముస్లింలు ఇంకెందరో. వాళ్ల బాధ అపారమైంది.. 

.. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య ఈ మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించింది. గాజాలో హింసకు ముగింపు పలకాలన్నా.. అంతిమంగా యుద్దం ముగిసిపోవాలన్నా ఇదే అత్యుత్తమ మార్గం అని బైడెన్‌ తన సందేశంలో స్పష్టం చేశారు.

అంతేకాదు.. మయన్మార్‌లో రోహింగ్యాలు, చైనాలో ఉయిగర్లు.. ఇలా ఇతర ముస్లిం తెగల హక్కుల పరిరక్షణ కోసం అమెరికా  ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. అలాగే.. సూడాన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం ముగింపునకు శాంతిపూర్వకం తీర్మానం రూపకల్పన దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్లు తెలిపారాయన. తన పరిపాలన ఇస్లామోఫోబోబియా, ఇతరత్ర రూపాల్లో ఉన్న పక్షపాత ధోరణిని ఎదుర్కొనేందుకు జాతీయ వ్యూహాన్ని అనుసరిస్తోందని.. ఇది ముస్లింలకు మాత్రమే కాకుండా అరబ్‌, సిక్కు, దక్షిణాసియా అమెరికన్లపై కూడా ప్రభావం చూపెడుతుందని తన బక్రీద్‌ సందేశంలో బైడెన్‌ పేర్కొన్నారు.

బైడెన్‌ ప్రతిపాదించిన ఒప్పందం ఇదే.. 

  • మొదటి దశ.. ఇది ఆరు వారాలు కొనసాగుతుంది. ఇందులో ఇజ్రాయెల్‌-హామాస్‌ బలగాలు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణను పాటించాలి. గాజాలోని జనాలు ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్‌ బలగాలు వెనుదిరగాలి. వందల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్‌ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు, వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్‌ అప్పగించాలి. 

  • రెండో దశలో.. సైనికులు సహా సజీవ ఇజ్రాయెలీ బందీలందరినీ హమాస్‌ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్‌ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేయాలి. 

  • మూడో దశలో.. గాజాలో పునర్నిర్మాణ పనులు భారీస్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయినవారి అవశేషాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలి.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)