Breaking News

భారత్‌-పాక్‌లపై ‘అనుమానం’: ట్రంప్‌కు రూబియో వంతపాట

Published on Mon, 08/18/2025 - 07:42

వాషింగ్టన్‌: భారత్‌- పాక్‌లలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అమెరికా అనుక్షణం గమనిస్తున్నదని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వెల్లడించారు. సుదీర్ఘ ఘర్షణల తర్వాత కాల్పుల విరమణను కొనసాగించడం సవాలుగా మారుతుందని అందుకే అమెరికా.. భారత్‌-పాక్‌లపై ఓ కన్నేసి ఉంచిందని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచంలోని ఇతర ఉద్రిక్తతల దేశాలతో పాటు భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న పరిస్థితిని అమెరికా ప్రతిరోజూ గమనిస్తున్నదని, ప్రస్తుత, భావి సంఘర్షణలను నిరోధించే శాంతి ఒప్పందం లక్ష్యంగా అమెరికా దృష్టి సారించిందని రూబియో  అన్నారు. ‘ప్రతిరోజూ పాకిస్తాన్-భారతదేశం మధ్య ఏమి జరుగుతున్నదో, కంబోడియా- థాయిలాండ్ మధ్య ఏమి చోటుచేసుకుంటున్నదో తాము నిరంతరం గమనిస్తూనే ఉన్నామని  రూబియో మీడియాకు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడు అమెరికా కాల్పుల విరమణకు పిలుపునిస్తున్నదని, అయితే శత్రుత్వం కొనసాగుతున్నప్పుడు చర్చలు జరపడం కష్టమని రూబియో  తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
 

యుద్ధ విరమణకు ఏకైక మార్గం ఇరుపక్షాలు పరస్పరం కాల్పుల విరమణకు అంగీకరించడమేనన్నారు. అయితే రష్యన్లు  ఇందుకు అంగీకరించలేదని, ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ఆయన అన్నారు. సుదీర్ఘ ఘర్షణల తర్వాత కాల్పుల విరమణ అనేది చాలా త్వరగా విచ్ఛిన్నమవుతుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం మాత్రమే కాకుండా, భవిష్యత్తు సంఘర్షణలను నిరోధించేలా శాంతి ఒప్పందం కుదరడం లక్ష్యంగా ఉండాలని రూబియో పేర్కొన్నారు.

కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గతంలో తాను భారత్‌- పాక్‌ మధ్య ఉద్రిక్తతలను తగ్గించానని, పదేపదే చెబుతూ వచ్చారు. తన జోక్యంతో రెండు అణ్వాయుధ దేశాల మధ్య కాల్పుల విరమణకు సహకరించానని ట్రంప్‌ వాదించారు. అయితే భారత్‌ ఈ వాదనలను  తిరస్కరించింది. పాకిస్తాన్‌తో నెలకొన్న అన్ని సమస్యల పరిష్కారం ద్వైపాక్షికంగానే జరుగుతున్నదని, మూడవ పక్షం మధ్యవర్తిత్వం పాత్ర  ఏమీలేదని  స్పష్టం చేసింది.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)