Breaking News

నిద్రలో హఠాత్తుగా లేచి తుపాకీతో కాల్చుకున్నాడు.. కారణం తెలిస్తే షాక్‌..

Published on Sat, 06/17/2023 - 11:55

వాషింగ్టన్‌: నిద్రలో కలలు రావడం సాహజం. ఒక్కోసారి అవి కలలా కాకుండా నిజ జీవితంలో జరిగినట్లు అనిపిస్తుంటుంది.  ఒక పీడ కలల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి వస్తే చాలు దెబ్బకు భయపడి లేచి చూసేసరికి మంచం మీద నుంచి కిందపడిపోయి ఉంటాం. ఇలాంటి వింత అనుభవాలు ఎప్పుడో ఒకప్పుడు మనకి ఎదురై ఉంటాయి. ఇదే తరహాలోనే ఓ వ్యక్తికి విచిత్రమైన కల కని.. నిజం తుపాకితో తననే కాల్చుకున్నాడు.  అమెరికాలోని ఇల్లినాయిస్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఆ కల  ఏంటంటే...

నిద్ర మత్తులో అలా జరిగిపోయింది
అమెరికా ఇల్లినాయిస్‌లోని లేక్‌ బారింగ్టన్‌లో మార్క్‌ డికారా నివసిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతను నిద్రపోతుండగా ఓ కల వచ్చింది. ఆ కలలోజ... ఎవరో ఓ వ్యక్తి తలుపులు బద్దలుకొట్టుకుని ఇంట్లోకి చొరబడినట్లు అనిపించింది. దీంతో డికారా భయాందోళనకు గురయ్యాడు. దొంగ నుంచి కాపాడుకోవాడానికి కాల్పులు జరిపేందుకు సిద్ధమయ్యాడు. అయితే నిద్ర మత్తులో ఉన్న డికారా తన దగ్గర ఉన్న 357-క్యాలిబర్ రివాల్వర్‌తో నిజంగానే కాల్చాడు. అయితే  అది నేరుగా అతని కాలిలోకే దూసుకెళ్లింది. దెబ్బకు అతని నిద్రంతా ఎగరిపోయింది. బుల్లెట్‌ కారణంగా తీవ్ర రక్తస్రావం అయ్యింది. గాయం కారణంగా విలవిల్లాడుతూ.. గట్టి అరవడం మొదలుపెట్టాడు. మరో వైపు రివాల్వర్‌ పేలిన శబ్దం విన్న  స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. చివరకు దొంగతనం జరిగినట్లు కల రావడం.. ఆ నిద్ర మబ్బులోనే కాల్పులు జరిపినట్లు నిర్ధారించుకున్నారు. ఆ ప్రాంతంలో తుపాకీ కలిగి ఉండాలంటే ప్రభుత్వం నుంచి ఫైర్‌ఆర్మ్‌ ఓనర్స్‌ ఐడెంటిఫికేషన్‌ కార్డు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. కానీ చాలా రోజుల కిందటే అతని ఐడెంటిఫికేషన్‌ డికార కార్డు రద్దయ్యింది. అయినా అతను రివాల్వర్‌ను వాడుతుండడంతో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం నేరాల కింద పోలీసులు అతనిపై కేసులు నమోదు చేశారు.

చదవండి: ఈ దీవుల్లో హాయిగా ఉండండి.. రూ. 70 లక్షల అందుకోండి!

#

Tags : 1

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)