Breaking News

ఐటీ ఉద్యోగులకు బిగ్‌ షాక్‌.. హెచ్‌-1బీ వీసా రద్దుకు బిల్లు

Published on Tue, 02/10/2026 - 19:54

వాషింగ్టన్‌ డీసీ: హెచ్‌-1బీ వీసాల అమలులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. హెచ్‌-1బీ వీసాలను రద్దు చేయాలని అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్‌ ఎంపీ స్టూబ్‌ బిల్లును ప్రవేశ పెట్టారు. విదేశీయులకు ప్రాధాన్యం ఇవ్వడం అమెరికాకు నష్టమన్న స్టూబ్‌.. అమెరికా యువతకు ఉద్యోగాలు రావడం లేదని వాదించారు. 

అమెరికా కాంగ్రెస్‌లో ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ ప్రతినిధి గ్రెగ్ స్ట్యూబ్ ఒక సంచలనాత్మక బిల్లు ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు పేరు  Ending Exploitative Imported Labour Exemptions Act (EXILE Act). దీని ద్వారా అమెరికాలో ఉన్న హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేయాలని ప్రతిపాదించారు.

‘విదేశీ కార్మికులను ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అమెరికా పౌరుల సంక్షేమం, అభివృద్ధి దెబ్బతింటోంది. ఇది జాతీయ ప్రయోజనాలకు విరుద్ధం’అని అన్నారు. హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్ కారణంగా అమెరికా యువత, కార్మికులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. మన పిల్లలకు అమెరికన్ డ్రీమ్‌ను కాపాడాలంటే విదేశీయులకు పెద్దపీఠ వేయకూడదని స్పష్టం చేశారు.

అదే సమయంలో గ్రెగ్‌ స్ట్యూబ్ బిల్లులో హెచ్‌-1బీ వీసా దుర్వినియోగం వల్ల అమెరికా కార్మికులు ఎలా నష్టపోయారో ఉదాహరణలు ఇచ్చారు. ఉదాహరణకు, 2015లో డిస్నీ 250 మంది ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో విదేశీ కార్మికులను హెచ్‌-1బీ వీసా ద్వారా తీసుకువచ్చింది. 2014లో సదర్న్ కాలిఫోర్నియా ఎడిసన్ 540 మంది ఉద్యోగులను తొలగించి, భారతీయ ఔట్‌సోర్సింగ్ కంపెనీల ద్వారా వచ్చిన కార్మికులను నియమించింది. మైక్రోసాఫ్ట్‌లో 16,000 మంది ఉద్యోగులు తొలగింపులకు గురి కాగా.. ఆ సమయంలో 9వేల హెచ్‌-1బీ వీసాలు మంజూరయ్యాయని ఆయన గుర్తు చేశారు.

ఈ బిల్లుతో అమెరికాలోని ఐటీ రంగం, ముఖ్యంగా భారతీయ వృత్తిపరులు దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే హెచ్‌-1బీ వీసాలు లేకుండా అమెరికాలో ఉద్యోగాలు పొందడం చాలా కష్టమవుతుంది. ఇప్పటికే భారతదేశంలో వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడుతున్నాయి. వీసా స్టాంపింగ్ కోసం వెళ్లిన అనేక మంది భారతీయులు అమెరికాకు తిరిగి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)