Breaking News

ట్రంప్‌కు మరో బిగ్‌ షాక్‌.. బెడిసికొడుతున్న నిర్ణయాలు

Published on Fri, 02/28/2025 - 09:35

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు విషయంలో ట్రంప్‌ నిర్ణయాన్ని నిలిపివేస్తూ యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి విలియం అల్సప్‌ ఆదేశాలు జారీ చేశారు. ఫెడరల్‌ ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని తీర్పు వెల్లడించారు.

అమెరికాలో ఫెడరల్ ఏజెన్సీల్లో ఉద్యోగులను తొలగించాలన్న ప్రభుత్వ చట్టవిరుద్ధమైన ఆదేశాలపై పలు యూనియన్లు, న్యాయవాద సంఘాలు దావా వేశాయి. దీనిపై తాజాగా యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా డిస్ట్రిక్ట్‌ జడ్జి విలియం అల్సప్‌ కీలక తీర్పును వెల్లడించారు. అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని స్పష్టంచేశారు. తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పారు. దీంతో, ట్రంప్‌కు భారీ షాక్‌ తగిలినట్టు అయ్యింది.

డొనాల్డ​్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అమెరికాలో అనవసర ఖర్చులను తగ్గించే ప్రణాళికలో భాగంగా ఫెడరల్ ఉద్యోగులను తొలగించాలని ట్రంప్‌ డోజ్‌ శాఖకు సూచించారు. ఈ మేరకు వివిధ శాఖల్లో ఉద్యోగులను తొలగించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మార్చి 13లోగా ప్రణాళికలను అందించాలని ఆదేశించారు. ఉద్యోగుల తొలగింపుతో పాటు ఉద్యోగ స్థానాన్ని కూడా పూర్తిగా తొలగించాలని అందులో పేర్కొన్నారు. వీటి ఫలితంగా రానున్న రోజుల్లో ప్రభుత్వ పనితీరులో విస్తృత మార్పులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక, ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి డొనాల్డ్‌ ట్రంప్‌ ఇదివరకే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. 

ఇదిలా ఉండగా.. ట్రంప్‌ నిర్ణయాల కారణంగా పలు విషయాల్లో ఆయనకు ఎదురుదెబ్బలు తగిలాయి. జన్మత:పౌరసత్వం, యూఎస్‌ఎయిడ్‌లో ఉద్యోగుల తొలగింపు, పలు నిర్ణయాలను కోర్టు తప్పుబట్టింది. ఈ క్రమంలో ట్రంప్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టులు తీర్పులను వెల్లడించాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)