Breaking News

హెచ్‌1-బీ పై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు

Published on Fri, 07/10/2026 - 07:18

వాషింగ్టన్ డీసీ: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ హెచ్‌-1బీ వీసా నిబంధనల మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఉన్న ఉద్యోగాలు అమెరికన్లకేనేగాని విదేశీ మోసగాళ్లకు కాదన్నారు. అయితే కొంతమంది విదేశీ కార్పోరేషన్లు అమెరికాలోని కార్మికుల వేతనాలను తగ్గించడానికి ఈ వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దానికి అడ్డకట్ట వేస్తున్నామని వాన్స్‌ ఉద్ఘాటించారు.

ట్రంప్ అమెరికాలోని విదేశీయుల పట్ల ఎంత కఠినంగా వ్యవహారిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రెండోసారి అధికారం లోకి వచ్చాక ఆ దూకుడు మరింత పెంచారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల నుంచి హెచ్‌-1బీ నిబంధనలు మరింత కఠినతరం చేయనున్నట్లు సమాచారం. దానిపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో జేడీ వాన్స్‌ స్పందించారు.

జేడీవాన్స్ మాట్లాడుతూ" హెచ్‌-1బీ వీసా కార్యక్రమం ఒక ప్రతిభావంతుడైన సాంకేతిక నిపుణుడు, లేదా ఒక ప్రతిభావంతుడైన శాస్త్రవేత్త, లేదా ఒక ప్రతిభావంతుడైన వైద్యుడు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయడానికి కానీ.. ఆ ఉద్దేశ్యాన్ని మార్చారు. మీకు తెలుసా, విదేశాల్లోని పెద్ద కార్పొరేషన్లు మోసగాళ్లు అమెరికన్ కార్మికుల వేతనాలను తగ్గించడానికి ఈ కార్యక్రమాన్ని చాలా ఎక్కువగా వాడుకుంటున్నారు. కాబట్టి, ట్రంప్ పరిపాలనలో మేం ఏం చేస్తున్నామో మీకు తెలుసా? ఇకపై కుదరదని మేం చెబుతున్నాం. మీరు ఆ వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తుంటే, అటువంటి వారికి అమెరికాలోకి ప్రవేశం లేదు," అని ఆయన అన్నారు.

నేను మీకు ఒకటి ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి కానీ విదేశీ మోసగాళ్లకు కాదు దానికోసం అమెరికా కార్మికశాఖ పోరాడుతుంది అని వాన్స్ నొక్కి చెప్పారు.

వీసా నిబంధనల్లో మార్పులు?

అమెరికన్‌ కంపెనీలు విదేశీ నిపుణులకు ఉద్యోగాలిచ్చేందుకు అవకాశమిచ్చే హెచ్‌1–బీ వీసాల ఫీజులు గణనీయంగా పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. ఉద్యోగితోపాటు, కంపెనీ తాలూకూ వివరాలను మరింత నిశితంగా పరిశీలించనున్నారు. క్లయింట్‌ సైట్లలో ఉద్యోగులు ఎలాంటి పనులు చేస్తున్నారో వివరంగా చెప్పాల్సి ఉంటుంది. హెచ్‌1–బీ వీసా ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీల విషయంలో మరింత కఠినంగా ఉండనున్నారు.

యూనివర్శిటీలు, పరిశోధన సంస్థలకు ప్రస్తుతం ఉన్న వార్షిక కోటా మినహాయింపు రద్దయ్యే లేదా కుదించే అవకాశముంది. అమెరికాలో శాశ్వత నివాసానికి అవకాశమిచ్చే గ్రీన్‌కార్డుల విషయానికి వస్తే పెర్మ్‌ లేబర్‌ సర్టీఫికెట్లు జారీ చేసేందుకు వసూలు చేసే ఫీజులను కూడా పెంచాలని కార్మీక శాఖ ప్రతిపాదిస్తోంది. సాధారణంగా కంపెనీలు తమ వద్ద పనిచేస్తున్న హెచ్‌1–బీ వీసాదారులకు గ్రీన్‌కార్డు ఇవ్వాలని కార్మిక శాఖకు ప్రతిపాదిస్తారు.

అమెరికన్లు చేయలేని పని హెచ్1–బీ వీసాదారు చేస్తున్నాడని, అతడికి ఇచ్చే వేతనం అమెరికన్లకు ఇచ్చే వేతనం కంటే ఎక్కువగా ఉందని కంపెనీ నిరూపిస్తే పెర్మ్‌ సర్టీఫికెట్‌ లభిస్తుంది. ఇందుకయ్యే ఖర్చును పెంచడం ద్వారా గ్రీన్‌ కార్డులను మరింత తగ్గించున్నారన్నమాట. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)