అమెరికా గుడ్ల వేట

Published on Sun, 03/23/2025 - 05:02

వాషింగ్టన్‌: గుడ్ల కొరతతో గుడ్లు తేలేస్తున్న అమెరికా సమస్య నుంచి గట్టెక్కేందుకు వాటిని భారీగా దిగుమతి చేసుకునే పనిలో పడింది. ఇందుకోసం తుర్కియే, దక్షిణ కొరియాలను సంప్రదిస్తోంది. తక్షణం కోట్లాది గుడ్లను పంపేలా వాటితో ముమ్మరంగా చర్చలు జరుపుతున్నట్టు వ్యవసాయ మంత్రి బ్రూక్‌ రోలిన్స్‌ శుక్రవారం వెల్లడించారు. పలు ఇతర దేశాలతోనూ మాట్లాడుతున్నట్టు చెప్పుకొచ్చారు. అమెరికా తమను కూడా సంప్రదించినట్టు పోలండ్, లిథువేనియా వంటి దేశాలు ధ్రువీకరించాయి. బర్డ్‌ఫ్లూ తదితరాలతో కోళ్ల సంఖ్య బాగా తగ్గడం అమెరికాలో గుడ్ల కొరతకు దారి తీసింది. దాంతో వాటి ధరలు కొద్ది నెలలుగా చుక్కలనంటడం తెలిసిందే.

డజను గుడ్లకు 5 డాలర్లు, అంతకుమించి వెచ్చించాల్సి వస్తోంది. షికాగో వంటి ప్రధాన నగరాల్లో 9 నుంచి 10 డాలర్ల దాకా ధరలు ఎగబాకాయి. అంతంత పెట్టి కొనలేక చాలామంది ఏకంగా కోళ్లనే పెంచుకుంటున్నారు. దాంతో గుడ్ల ధరలను నేలకు దించే మార్గాలపై ట్రంప్‌ సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. ఇందుకోసం 100 కోట్ల డాలర్లతో నిధి ఏర్పాటు వంటి పలు చర్యలు తీసుకున్నా పెద్దగా పలితం కన్పించడం లేదు.

రెండు నెలల్లో దేశీయంగా కోళ్ల సంఖ్య పెరిగి సమస్య చక్కబడుతుందని రోలిన్స్‌ ఆశాభావం వెలిబుచ్చారు. బర్డ్‌ఫ్లూ దెబ్బకు గత రెండున్నరేళ్లలో అమెరికాలో కనీసం 20 కోట్ల కోళ్లను వధించారు. దాంతో చుక్కలనంటిన గుడ్ల ధరలు ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో కూడా ట్రంప్‌కు అస్త్రంగా కూడా మారాయి. తాను పగ్గాలు చేపట్టగానే వాటికి ముకుతాడు వేస్తానని ప్రకటించారు.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)