Breaking News

ఇరాన్ బలం ఎఫ్‌-14 యుద్ధ విమానాలు... ఇచ్చిన దేశం పైనే దాడి?

Published on Fri, 01/16/2026 - 20:56

ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఏ క్షణాన రెండు దేశాల మధ్య యుద్ధం వస్తుందో అనే భయం ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. అందుకే చాలా దేశాలు తమ పౌరులను అక్కడి నుంచి వెనక్కి రప్పించుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం ఇరాన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో కీలకంగా భావిస్తున్న ఎఫ్‌-14 ఫైటర్‌ జెట్స్ ఆ దేశానికి అమెరికా ఇచ్చినవే.. అవునండీ ఇది అక్షరాల నిజం.

ఇరాన్- అమెరికా దేశాల మధ్య వైరం తీవ్రస్థాయికి చేరుకుంది. రెండు దేశాల మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే 1970లలో ఈ రెండు దేశాలు చాలా స్నేహంగా ఉండేవి. ఆ సమయంలో ఆ దేశ అధ్యక్షుడిగా షా మహమ్మద్ రెజా పహ్లావీ ఉండేవారు. పశ్చిమాసియాలో రష్యా ప్రభావాన్ని తగ్గించడానికి అమెరికా ఇరాన్‌తో చాలా స్నేహంగా ఉండేది. అందుకే అప్పుడు 79 వరకూ, F14 టామ్‌ క్యాట్ యుద్ధ విమానాలు ఇరాన్‌కు విక్రయించేలా కీలక ఒప్పందం చేసుకుంది. అప్పుడు ఆయుధాల ఒప్పందంలో ఈ డీల్ చాలా పెద్దది.  

అయితే కొంతకాలం తర్వాత అమెరికా- ఇరాన్‌ల మధ్య శతృత్వం రావడంతో అమెరికా ఆంక్షలు విధించడం ప్రారంభించింది. F-14 విడిభాగాల సరఫరా చేయడం పూర్తిగా నిలిపివేసింది. దీంతో అత్యాధునికి ఫైటర్ జెట్స్ ఉన్నా అవి ఎగరడానికి విడిభాగాలు, సాంకేతికమైన మద్ధతు లేకపోవడంతో ఆదేశం కఠిన నిర్ణయం తీసుకుంది. వాటివద్ద ఉన్న యుద్ధవిమానాలలో కొన్నింటినైనా వాడుకునేలా ప్లాన్ వేసింది. వాటి వద్ద ఉన్న F-14 విమానాలను విడగొట్టింది. వాటిని మిగతా వాటికి అమర్చి వాటితో యుద్ధంచేసేలా ప్రణాళిక వేసింది. అయితే ఇరాన్ వద్ద ప్రస్తుతం ఎన్ని F-14 ఫైటర్‌ జెట్స్ అందుబాటులో ఉన్నాయా అనేది స్పష్టంగా చెప్పలేము. క్రితంతో పోలిస్తే ఎంతో కొంత తగ్గే ఉంటాయనేది కాదనలేని నిజం.

ఎఫ్-14 ప్రత్యేకతలు 
ఎఫ్‌-14 యుద్ధవిమానాలు చాలా శక్తివంతమైనవి.  అత్యంత శక్తివంతమైన రాడార్ వ్యవస్థ దాని సొంతం. ఇవి వందల కిలోమీటర్ల దూరం నుండి శత్రు విమానాలను టార్గెట్ చేసుకొని దాడులు చేయగలవు. అయితే వరల్డ్ సూపర్ మిలటరీ పవర్‌గా ఉన్న అమెరికాను వీటితో నియంత్రించడం అ సాధ్యం. అయితే ఆ దేశస్థావరాలను ధ్వంసం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌