Breaking News

విమానం టేకాఫ్‌ అవుతుందనంగా అది కావాలన్నాడు..అంతే గెంటేశారు

Published on Sat, 04/08/2023 - 13:34

విమానంలో ప్రయాణికుల వికృతి ఘటనలు గురించి తరుచుగా విన్నాం. కానీ ఇప్పుడూ ఒక ప్రయాణికుడు అలా ఏం చేయకపోయినా విమాన నుంచి బయటకు గెంటేశారు. అదీకూడా కేవలం డ్రింక్‌ చేస్తానని రిక్వెస్ట్‌ చేసినందుకు విమానం నుంచి బలవంతంగా బయటకు పంపించేశారు. ఈ ఘటన యూఎస్‌ ఎయిర్‌లైన్స్‌లో చోటు చేసుకుంది. 

అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని ఒక వ్యక్తి విమానం బయలుదేరే ముండు డ్రింక్‌ చేస్తానని తనకు జిన్‌ వంటి పానీయం కావాలని అడిగాడు. అంతే అక్కడ ఉ‍న్న సిబ్బంది సదరు వ్యక్తిని విమానం నుంచి దిగిపోమని సీరియస్‌ అయ్యారు. మొత్తం సిబ్బంది వచ్చి దిగిపోమని పలుమార్లు సూచించారు. అతనికేం అర్థం కాక ఎందుకిలా అంటున్నారని ఆ ఘటనను మొత్తం ఫోన్‌తో వీడియో తీసేందుకు రెడీ అ‍య్యాడు.

అంతే అక్కడ ఉన్న సిబ్బంది, ఫ్లైట్‌ అటెండెంట్‌ అతని ఫోన్‌ని లాక్కుని, ఆ వ్యక్తిని బలవంతంగా విమానం నుంచి బయటకు గెంటేశారు. తదనంతరం అక్కడ ఉన్న ఎయిర్‌పోర్ట్‌ భద్రతా విభాగం అతన్ని అరెస్టు చేశారు. ఐతే సిబ్బంది అసహనంతో అలా చేశారా లేక ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడో తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించిన వీడియో రెడ్‌ఇట్‌లో వైరల్‌ అవ్వడంతో పలువురు నెటిజన్లు మండిపడ్డారు. అతను చిన్నపిల్లాడిలా అలా చేయడం ఆశ్చర్యంగా అనిపించిందని కొందరూ, ఇది అత్యంత అవమానకరం అని మరికొందరూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. 

(చదవండి: కాల్పుల భయంలో అమెరికా..పరుగెత్తండి, దాక్కోండి అంటూ యూనివర్సిటీ హడావిడి..)

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య