Breaking News

తగ్గుతున్న అమెరికా ఇమేజ్‌ 

Published on Thu, 07/17/2025 - 06:32

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా ప్రజాభిప్రాయంలో మార్పు వస్తోంది. అందరి హాట్‌ ఫేవరెట్‌గా ఉన్న అమెరికా ఇమేజ్‌ తగ్గిపోతోంది. అంతేకాదు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పట్ల సానుకూలత గణనీయంగా తగ్గిపోతోంది. చైనా, ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పట్ల ఆదారణ పెరుగుతోంది. ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ నిర్వహించిన కొత్త సర్వే ఈ విషయాలు వెల్లడించింది. గతంలో నిర్వహించిన సర్వేల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. చైనా పట్ల వ్యతిరేకత ఉండేది. కానీ.. తీరు మారుతోంది. ఇటీవలి సంవత్సరాలతో పోలిస్తే.. ఇప్పుడు రెండు అగ్రరాజ్యాలు సమానంగా అభిమానాన్ని సంపాదించుకుంటున్నాయి.  

8 దేశాలు అమెరికా వైపు.. 7 దేశాలు చైనా వైపు..  
జనవరి 8 నుంచి ఏప్రిల్‌ 26 వరకు యూఎస్‌ సహా 25 దేశాలలో 30,000 మందికి పైగా వ్యక్తులను ప్యూ సర్వే చేసింది. 24 దేశాల్లో నిర్వహించిన తాజా సర్వేలో, ఎనిమిది దేశాలలో అమెరికాను గొప్పగా అభివరి్ణంచారు. ఏడు దేశాలలో చైనాను పొగిడారు. మిగిలిన దేశాల్లో రెండింటికీ సమాన గౌరవం లభించింది. ముఖ్యంగా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీతో సహా 10 అధిక ఆదాయ దేశాల్లో 35% మంది మాత్రమే అమెరికా పట్ల సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. గత సంవత్సరం 51% ఉండగా.. ఇప్పుడది 35 శాతానికి పడిపోయింది. ఈ ధనిక దేశాల్లో 32% మంది చైనా పట్ల సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఇది గత సంవత్సరం 23% మాత్రమే ఉంది. అంటే తొమ్మిది శాతం పెరిగింది. ఇక అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై తమకు నమ్మకం ఉందని 22% మంది చెప్పారు. ఇది గత సంవత్సరం 17%గానే ఉంది. అంటే ఈ ఏడాదికి 5శాతం పెరిగింది.  

ట్రంప్‌ విదానాలే కారణం! 
ఈ మార్పునకు కారణమేంటనేదీ ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ తేల్చలేకపోయింది. అయితే.. అభివృద్ధి చెందుతున్న భౌగోళిక రాజకీయ మార్పులు, నాయకత్వం అవగాహన ఈ ఫలితాలకు కారణమై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌ పరిపాలన విదేశాంగ విధాన నిర్ణయాలపై విమర్శలు పెరుగుతున్న తరుణంలో ఈ ఫలితాలు వెలువడ్డాయి. విదేశీ సహాయాన్ని తగ్గించడం, సాంప్రదాయ మిత్రదేశాలపై సుంకాలను విధించడం, అంతర్జాతీయ విద్యార్థులను ప్రభావితం చేసే వలస విధానాలను కఠినతరం చేయడం వంటి వరుస విధాన చర్యలు అమెరికా పట్ల విశ్వసనీయతను పోగొడుతున్నాయని డెమొక్రాట్‌ సెనేటర్ల బృందం ఆరోపించింది.  

అమెరికావైపే ఇజ్రాయెలీలు..  
ఇక.. ఇజ్రాయెల్‌ ప్రజలు మాత్రం.. పాలస్తీనా, ఇరాన్‌లపై తమ యుద్ధానికి మద్దతు ఇచ్చిన అమెరికా పట్లనే ఎక్కువ సానుకూలంగా ఉన్నారు. 83% మంది ఇజ్రాయేలీలు అమెరికాను ఇష్టపడుతుండగా.. 33% మంది చైనా పట్ల తమ సానుకూలతను తెలిపారు. వారిలో 69% మంది ట్రంప్‌పై తమకు నమ్మకం ఉందని చెబుతుండగా, 9% మంది మాత్రమే జిన్‌పింగ్‌ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)