Breaking News

క్లాసులు డుమ్మా కొడితే ఇంటికే

Published on Wed, 05/28/2025 - 02:27

వాషింగ్టన్‌:  అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరగతులకు డుమ్మా కొట్టినా లేక కోర్సులు మధ్యలో వదిలేసినా వీసా రద్దు కావడం ఖాయం. భవిష్యత్తులో వీసా కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం కూడా ఉండదు. అంటే అమెరికాలో మళ్లీ అడుగు పెట్టడం చాలా కష్టమనే చెప్పొచ్చు.

విద్యాసంస్థకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా తరగతులకు గైర్హాజరు కావడం లేదా కోర్సును మధ్యలోనే వదిలేయడం వంటివి చేస్తే విద్యా వీసా రద్దవుతుందని ఇండియాలోని అమెరికా ఎంబసీ తేల్చిచెప్పింది. ఈ మేరకు మంగళవారం సోషల్‌ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. వీసా నిబంధనలకు ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టుబడి ఉండాలని తేల్చిచెప్పింది. అమెరికాలో చదువుకుంటున్న కాలం లో సమస్యలేవీ రాకుండా ఉండాలంటే స్టూడెంట్‌ స్టేటస్‌ కోల్పోకుండా జాగ్రత్తపడాలని పేర్కొంది. అమెరికాలో లక్షలాది మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతిఏటా వీరి సంఖ్య పెరుగుతోంది.    

విదేశీ విద్యార్థుల్లో ట్రంప్‌ గుబులు  
అమెరికాలోని విదేశీ విద్యార్థులపై డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ఇటీవలి కాలంలో కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ముందస్తుగా నోటీసు ఇవ్వకుండానే వీసాలు రద్దు చేస్తోంది. దాంతో చాలామంది అమెరికాను వీడి స్వదేశాలకు వెళ్లిపోవాల్సి వస్తోంది. పాలస్తీనాకు అనుకూలంగా నిరసనల్లో పాల్గొన్నవారి వీసాలు రద్దయ్యాయి. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలినా వేటు పడింది. ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాలపై న్యాయ పోరాటం చేసే శక్తి లేని విద్యార్థులు మౌనంగా స్వదేశాల బాట పడుతున్నారు. న్యాయ పోరాటంలో గెలిచిన విద్యార్థులు సైతం కొందరు ఉన్నారు. కానీ, వారి సంఖ్య చాలా స్వల్పం.

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఆధ్వర్యంలోని స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(సెవిస్‌) నుంచి విదేశీ విద్యార్థుల వివరాలను హఠాత్తుగా తొలగిస్తున్నారు. దాంతో వారు అమెరికా వదిలి వెళ్లాల్సి వస్తోంది. ఇలా తొలగిస్తున్నట్లు విద్యార్థులకు గానీ, యూనివర్సిటీలకు గాను ముందుగా తెలియజేయడం లేదు. మరోవైపు ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ) సదుపాయాన్ని తొలగించాలని ట్రంప్‌ సర్కారు నిర్ణయించడం విదేశీ విద్యార్థుల్లో గుబులు రేపుతోంది.

ఈ మేరకు ఫెయిర్‌నెస్‌ ఫర్‌ హై–స్కిల్డ్‌ అమెరికన్స్‌ యాక్ట్‌–2025 పేరిట ఒక బిల్లును ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ బిల్లు చట్టంగా మారితే.. గ్రాడ్యుయేషన్‌ తర్వాత విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉద్యోగాలు చేసుకొనేందుకు అవకాశం ఉండదు. చదువు పూర్తికాగానే సొంత దేశాలకు వెళ్లిపోవాల్సిందే.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)