Breaking News

ట్రంప్‌ గెలుపుపై చైనా రియాక్షన్‌

Published on Wed, 11/06/2024 - 17:08

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ ఘన విజయం సాధించారు. అమెరికా ప్రజలు రిపబ్లిక్‌ పార్టీ వైపు మొగ్గు చూపటంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు నిరాశ ఎదురైంది. ఇక.. ట్రంప్ సాధించిన భారీ విజయంపై భారత ప్రధాని మోదీతో సహా పలు దేశాధినేతలు, దేశాలు స్పందిస్తూ.. ఆయన అభినందనలు తెలియజేస్తున్నాయి. తాజాగా చైనా సైతం డొనాల్డ్‌ ట్రంప్‌ విజయంపై స్పందించింది. అయితే.. ట్రంప్‌ పేరు నేరుగా ప్రస్తావించకుండా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై డ్రాగన్‌ దేశం స్పందించింది.

‘‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజల ఎంపిక నిర్ణయాన్ని గౌరవిస్తాం. అధ్యక్ష ఎన్నికలు అమెరికా అంతర్గత వ్యవహారం. అయితే.. అమెరికా పట్ల చైనా విధానం స్థిరంగా ఉంది. పరస్పర గౌరవం, శాంతియుత జీవనం, సహకారం వంటి సూత్రాలకు అనుగుణంగా చైనా-యూఎస్ సంబంధాలను కొనసాగిస్తాం’’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. మరోవైపు.. చైనాపై కఠినంగా వ్యహరిస్తారనే ముద్ర ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌.. రానున్ను రోజుల్లో డ్రాగన్‌ దేశంతో సంబంధాలు ఎలా కొనసాగిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.

చదవండి:  ట్రంప్‌ విజయంపై మోదీ సహా ప్రపంచ నేతల స్పందన

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు