Breaking News

రాజ్యాంగ విరుద్ధమైనా.. ‘మళ్లీ నేనే!?’

Published on Tue, 10/28/2025 - 08:01

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(79) తన మనసులోని మాట బయటపెట్టారా?. ముచ్చటగా మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ పడాలనుకుంటున్నారా?. జపాన్‌ పర్యటనకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యల ఆంతర్యం అదేనంటూ చర్చ నడుస్తోంది ఇప్పుడు.

వైట్‌హౌజ్‌ మాజీ వ్యూహకర్త స్టీవ్‌ బానన్‌ తాజాగా ట్రంప్‌ మూడో దఫా పోటీపై ఆసక్తికర వ్యాఖ్య చేశారు. జపాన్‌ పర్యటనకు బయల్దేరే ముందు విమానం(Air Force One) వద్ద మీడియా ఆయన్ని ఆ వ్యాఖ్యలపై ప్రశ్నించింది. దానికి ట్రంప్‌ స్పందిస్తూ.. ‘‘మూడోసారి పోటీ చేయడం నాకు ఇష్టమే. నా వద్ద అత్యుత్తమ నెంబర్లు ఉన్నాయి’’ అంటూ బదులిచ్చారు. అయితే.. 

ఆ వెంటనే ‘‘ఇంకా ఆ విషయంపై నిజంగా ఆలోచించలేదు’’ అని అన్నారు.   ట్రంప్ తన తరువాత రిపబ్లికన్ పార్టీని నడిపే నాయకులుగా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్లను ప్రస్తావించారు. మా వద్ద గొప్ప నాయకులు ఉన్నారు అంటూ రుబియో వైపు చూపిస్తూ.. ‘వాళ్లలో ఒకరు ఇక్కడే ఉన్నారు’ అని చమత్కరించారు. అలాగే.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ప్రశంసిస్తూ.. అవును, జేడీ అద్భుతంగా ఉన్నాడు. ఉపాధ్యక్షుడు గొప్పవాడు. వీళ్లిద్దరిని ఎదుర్కొనే వారు ఉండరేమో అని ట్రంప్‌ అన్నారు.

అమెరికాకు అధ్యక్ష ఎన్నికలు 2028 సంవత్సరంలో జరగనున్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ఒక వ్యక్తి అధ్యక్ష పదవికి రెండుసార్లు మాత్రమే ఎన్నిక కావచ్చు. మూడోసారి పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధం. 

అయితే స్టీవ్‌ బానన్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ట్రంప్ 2028లో మూడోసారి అధ్యక్షుడిగా అవుతారు. దీనికి ఒక ప్రణాళిక ఉంది. కఠినమైన అడ్డంకే ఉన్నా.. దాన్ని అధిగమించే మార్గాలు ఉన్నాయి. 2016, 2024లో ట్రంప్‌ సాధించారు. వచ్చేసారి కూడా సాధించగలరు అని అన్నారు. 

గతంలో ఫ్రాక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌ అమెరికాకు నాలుగు పర్యాయాలు అధ్యక్షుడిగా పని చేశారు. అయితే.. 1951లో రాజ్యాంగానికి 22వ సవరణ (22nd Amendment) ద్వారా రాటిఫై చేశారు. 

ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే, అమెరికా రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణ చేయాలంటే, అత్యధిక రాష్ట్రాల ఆమోదం అవసరం. ఇది రాజకీయంగా చాలా కష్టమైన ప్రక్రియ. ఇది ప్రస్తుతం సాధ్యపడే అవకాశాలు లేవు. స్టీవ్‌ బానన్‌, ట్రంప్‌ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీసేలా ఉన్నా.. న్యాయపరంగా అవి అమలులోకి రావడం అసాధ్యం. 

ఇదిలా ఉండగా.. ఆసియా పర్యటనలో భాగంగా ట్రంప్ మలేషియా నుంచి జపాన్ చేరుకున్నారు. సోషల్‌ ట్రూత్‌లో ఈ మేరకు.. మలేషియా అద్భుతమైన దేశం. ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలు, రేర్ ఎర్త్ డీల్స్ సంతకం చేశాం. ముఖ్యంగా థాయ్‌లాండ్ మరియు కంబోడియా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. యుద్ధం లేదు! కోట్లాది ప్రాణాలు రక్షించబడ్డాయి. ఇది చేయడం గౌరవంగా ఉంది. ఇప్పుడు జపాన్‌కు బయల్దేరా అని పోస్ట్ చేశారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)