Breaking News

హిందూ ఆలయంపై విద్వేష రాతలు

Published on Sun, 12/24/2023 - 05:44

న్యూయార్క్‌/గాందీనగర్‌: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్రముఖ హిందూ ఆలయంపై దాడి జరిగింది. దుండగులు ఆలయ గోడపై భారత వ్యతిరేక అభ్యంతరకర చిత్రాలతోపాటు ఖలిస్తాన్‌ అంటూ కలర్‌ స్ప్రే చేశారు. పోలీసులు ఈ ఘటనను విద్వేష నేరంగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. నెవార్క్‌లోని స్వామి నారాయణ్‌ మందిర్‌ హిందూ ఆలయంపై అభ్యంతరకర చిత్రాలు(గ్రాఫిటీ) ఉన్నాయంటూ శుక్రవారం ఉదయం తమకు ఆలయ నిర్వాహకుల నుంచి ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసు అధికారులు వాటిని పరిశీలించారు. గ్రాఫిటీని రెచ్చగొట్టే చర్యగా ఆలయ పెద్దలు పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు. కావాలనే ఎవరో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని చెప్పారు. విద్వేష నేరంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నామన్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ తదితరాలతో ఆధారాలను సేకరిస్తున్నామని చెప్పారు.

ఈ ఘటనను అమెరికా విదేశాంగ శాఖ, శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత్‌ కాన్సులేట్‌ కార్యాలయం తీవ్రంగా ఖండించాయి. గతంలోనూ భారత దౌత్య కార్యాలయాలపై ఇలాంటి దాడులు జరిగాయి. జూలైలో శాన్‌ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్‌ కార్యాలయంపై ఖలిస్తాన్‌ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. అమెరికా, కెనడాలపౌరసత్వమున్న ఖలిస్తాన్‌ ఉగ్రవాది పన్నూపై హత్యాయత్నం వెనుక భారత ప్రమేయముందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

ఉపేక్షించరాదు: జై శంకర్‌
ఈ ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌ వెలుపల ఉగ్రవాదం, వేర్పాటువాదాలను ఉపేక్షించరాదని డిమాండ్‌ చేశారు.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు