Breaking News

హర్మూజ్‌ జలసంధి దగ్గర టెన్షన్‌ టెన్షన్‌..

Published on Tue, 06/09/2026 - 11:07

హర్మూజ్‌ జలసంధి దగ్గర యూఎస్ ఆర్మీ అపాచీ హెలికాప్టర్ కూలిపోయిందని.. అందులో ఇద్దరు సిబ్బందిని దళాలు సురక్షితంగా కాపాడినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. అయితే, హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. హెలికాప్టర్‌పై ఇరాన్ దళాలు దాడి చేశాయా? ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

హర్మూజ్‌ జలసంధి గుండా వాణిజ్య రవాణాను ఇరాన్ సమర్థవంతంగా అడ్డుకోవడాన్ని నిరోధించేందుకు అమెరికా దళాలు సాగిస్తున్న కార్యకలాపాల సమయంలోనే ఈ అపాచీ ప్రమాదం జరిగింది. ఈ ఆపరేషన్లలో భాగంగా యూఎస్ మిలిటరీ అపాచీ హెలికాప్టర్లతో పాటు MQ-9 రీపర్ డ్రోన్లు, F/A-18, F-35 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను రంగంలోకి దించింది.

ఫిబ్రవరి 28న ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ దాదాపు 30 MQ-9 రీపర్ డ్రోన్లను కూల్చివేసిందని, అలాగే శత్రువుల దాడి లేక పొరపాటున జరిగిన కాల్పుల వల్ల పలు యుఎస్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కూడా ధ్వంసమయ్యాయని అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి. ఈ ఘటన కూడా నిజమని తేలితే.. ఈ ఘర్షణల్లో యుఎస్ కోల్పోయిన మొదటి అపాచీ హెలికాప్టర్ ఇదే అవుతుంది.

'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' ఆపరేషన్ కింద హార్ముజ్ జలసంధి, పరిసర జలాల్లో వాణిజ్య నౌకలకు రక్షణగా యూఎస్ నేవీ వెళ్లేందుకు ముందు... సెంట్రల్ కమాండ్ ఫోర్స్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ అక్కడ వైమానిక పర్యటన నిర్వహించిన ఫోటోలను గత నెలలో సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది. AH-64 అపాచీ హెలికాప్టర్.. ఆ ప్రాంతంలో పనిచేస్తున్న అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలలో ఒకటి. వ్యూహాత్మక రవాణా మార్గాలను పర్యవేక్షించడానికి, చిన్న బోట్ల ద్వారా జరిగే దాడులను అడ్డుకోవడానికి, శత్రు డ్రోన్లను కూల్చివేయడానికి ఈ హెలికాప్టర్లను ఉపయోగిస్తారు.

హార్ముజ్ జలసంధి గుండా సముద్ర రవాణాను పునరుద్ధరించడానికి వాషింగ్టన్, టెహ్రాన్ దేశాల మధ్య పలుసార్లు చర్చలు జరుగుతున్నప్పటికీ... ఆ ప్రాంతంలో యూఎస్ సైన్యం తన దూకుడు ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగానే హార్మూజ్ జలసంధి.. పర్షియన్ గల్ఫ్‌లోని ఇరాన్ నియంత్రణలో ఉన్న దీవులకు అత్యంత సమీపంలో అపాచీ హెలికాప్టర్లు ఎక్కువగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

ఇరాన్ దిగ్బంధనానికి ప్రతిస్పందనగా అమెరికా.. ఏప్రిల్ నెలలో ఇరాన్ ఓడరేవులకు ప్రవేశ పరిమితులను విధించిందని కూడా ది న్యూయార్క్ టైమ్స్‌ పేర్కొంది. అప్పటి నుంచి హెచ్చరికలను బేఖాతరు చేసిన 130 కి పైగా నౌకలను యూఎస్ నౌకాదళాలు వెనక్కి పంపడమే కాకుండా.. మార్గాన్ని మార్చుకోని కొన్ని నౌకలను నిలిపివేశాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇరాన్ కూల్చివేసిన F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానం నుండి ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. వారు శత్రు భూభాగంలో పడినప్పటికీ.. యుఎస్ దళాలు వారిని విజయవంతంగా రక్షించి వెనక్కి తీసుకొచ్చాయి.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)