Breaking News

చారిత్రాత్మక అణు డీల్‌పై అమెరికా-సౌదీ సంతకం

Published on Thu, 07/23/2026 - 03:46

వాషింగ్టన్ : పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.  సౌదీ అరేబియాతో పౌర అణు సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై అమెరికా ఇంధన కార్యదర్శి  క్రిస్ రైట్, సౌదీ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్‌లు సంతకాలు చేశారు. ఈ వివరాలను యుఎస్‌ఏ అధికారికంగా ప్రకటించింది.

ఈ అంశంమై అమెరికా ఇంధన మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో  "ఈ రెండు ఒప్పందాలు దశాబ్దాల పాటు కొనసాగే, బిలియన్ల డాలర్ల భాగస్వామ్యానికి చట్టపరమైన పునాదిని వేస్తాయి. అణు వ్యాప్తి నిరోధకత  సహా పలు ముఖ్యమైన ఆర్థిక, వ్యూహాత్మక లక్ష్యాలను ఇవి ముందుకు తీసుకెళ్తాయి" అని ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఒప్పందంలో భాగమైన "ద్వైపాక్షిక భద్రతా ఒప్పందం"  ప్రకారం, సౌదీ అరేబియా తన అణు ప్లాంట్లలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ  అమెరికా అధికారుల తనిఖీలకు అంగీకరించాల్సి ఉంటుంది. దీనివల్ల అణు ప్లాంట్లలో ఏం జరుగుతోంది, ఎంత ఇంధనం వాడుతున్నారు అనేది పారదర్శకంగా తెలుస్తుంది. రహస్యంగా అణ్వాయుధాలు తయారు చేసే అవకాశం ఉండదు.

సాధారణంగా అమెరికా ఇచ్చే పౌర అణు ఒప్పందాలలో ఇతర దేశాలు తమ సొంత భూభాగంలో యురేనియాన్ని శుద్ధి చేయడానికి అనుమతించవు (దీనినే అణు నియమాలలో 'గోల్డ్ స్టాండర్డ్' అంటారు).కానీ ఈ ఒప్పందం ప్రకారం, అమెరికా-సౌదీల సంయుక్త అధ్యయనం తర్వాత సౌదీ అరేబియా తన సొంత భూభాగంలోనే యురేనియం శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు మార్గం సుగమమవుతుంది.

'గోల్డ్ స్టాండర్డ్' నియమాల మినహాయింపు

గతంలో అమెరికా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో ఒప్పందం చేసుకున్నప్పుడు యురేనియం శుద్ధి చేయకూడదని, వాడేసిన ఇంధనాన్ని రీ-ప్రాసెస్ చేయకూడదని కఠినమైన నిబంధన విధించింది. అయితే సౌదీ విషయంలో ఈ ముందస్తు నిషేధాలను సడలించడం ఒక ప్రధాన మార్పుగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Videos

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)