Breaking News

‘హమాస్‌’ అత్యాచారాలు.. యూఎన్‌ సంచలన నివేదిక

Published on Tue, 03/05/2024 - 07:40

జెరూసలెం: గతఏడాది అక్టోబర్‌7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ చేసిన దాడులకు సంబంధించి ఐక్యరాజ్యసమితి(యూఎన్‌) సంచలన విషయాలు వెల్లడించింది. అక్టోబర్‌ 7 దాడిలో ఇజ్రాయెల్‌పై దాడి సమయంలో అక్కడి మహిళలపై అత్యాచారాలు జరిగాయనేందుకు కచ్చితమైన, ఆధారలతో కూడిన సమాచారం ఉందని యుద్ధంలో జరిగిన లైంగిక దాడులపై యూఎన్‌ నియమించిన ప్రమీల పాటెన్‌ బృందం తేల్చింది.

హమాస్‌ బంధీలుగా తీసుకెళ్లిన ఇజ్రాయెల్‌ మహిళలపై ఇప్పటికీ అత్యాచారాలు జరుగుతున్నాయని యూఎన్‌ బృందం తన నివేదికలో తెలిపింది. ఫిబ్రవరిలో పాటెన్‌తో పాటు నిపుణుల బృందం ఇజ్రాయెల్‌, వెస్ట్‌బ్యాంక్‌లో పర్యటించారు. గాజా సరిహద్దులోని ఇజ్రాయెల్‌కు చెందిన మూడు ప్రాంతాలు నోవా మ్యూజిక్‌ ఫెస్టివల్‌ సైట్‌,రోడ్‌ 232, కిబుట్జ్‌ రెమ్‌లలో ఇజ్రాయెలీలపై రేప్‌లతో పాటు గ్యాంగ్‌ రేప్‌లు జరిగినట్లు రిపోర్టు వెల్లడించింది.

చాలా వరకు కేసుల్లో ముందు రేప్‌ చేసి తర్వాత హత్య చేశారని తెలిపింది. చనిపోయిన మహిళల మృతదేహాలపైన కూడా రెండు చోట్ల అత్యాచారాలు జరిగినట్లు ఐక్యరాజ్యసమితి బృందం తేల్చింది. ఈ అత్యాచారాలపై సాక్ష్యం చెప్పాల్సిందిగా బృందం కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. అత్యాచార ఘటనలపై యూఎన్‌ బృందం సభ్యులు మొత్తం 5వేల ఫొటోలు, 50 గంటల సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించడంతో పాటు రేప్‌కు గురైన బాధితులతో మాట్లాడారు.

హమాస్‌ వద్ద బంధీలుగా ఉండి విడుదలైన వారిని పలువురిని ఇంటర్వ్యూ చేశారు. కాగా, అక్టోబర్‌ 7న ఇజజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్‌ ఉగ్రవాద సంస్థ మెరుపు దాడులు జరిపి వందల మంది ఇజ్రాయెల్‌ పౌరులను చంపి కొంత మందిని బంధీలుగా తమ వెంట తీసుకెళ్లింది. దీనికి ప్రతీకారంగా అప్పటి నుంచి ఇజ్రాయెల్‌ సైన్యం పాలస్తీనాపై భీకర దాడులు చేస్తోంది. గాజాను మొత్తం చిధ్రం చేసింది. అమెరికా కోరినప్పటికీ ఇజ్రాయెల్‌ దాడులు ఆపడం లేదు. 

ఇదీ చదవండి..హైతీలో తీవ్ర అరాచకం

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)