Breaking News

విపత్తు వస్తే ఇల్లు దాక్కుంటుంది!

Published on Tue, 07/14/2026 - 04:58

ఈ మధ్య యూరోపియన్‌ దేశాలను కార్చిచ్చులు కాల్చిపారేస్తున్నాయి. మూడు రోజుల క్రితం స్పెయిన్‌లోని ఓ పర్యాటక ప్రదేశంలో కార్చిచ్చు కారణంగా 17 మందికిపైగా మరణించారు. కార్చిచ్చు మాత్రమే కాదు తుపాన్లు చుట్టుముట్టినా ఈ ఇంటికి ఏమీ కాదు. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు వస్తున్నాయని తెలిస్తే చాలు ఇల్లు మొత్తం నేల కింద ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన గొయ్యిలోకి దిగిపోతుంది. 

అమెరికన్‌ ఇంజినీర్లు సృష్టించిన ఈ అద్భుతం పేరు ‘హైబర్‌ టెక్‌ హోమ్స్‌’. మీరు ఎక్కడున్నా ఇంటిని భూమి లోపలికి పంపించేసేందుకు యాప్‌ రెడీ చేశారు. యాప్‌లో బటన్‌ నొక్కడమే ఆలస్యం హైడ్రాలిక్‌ గేర్ల సాయంతో ఇల్లు.. అడుగున ఉన్న బాక్స్‌లోకి వేగంగా జారిపోతుంది. ఇంట్లోని విద్యుత్తు, గ్యాస్‌ కనెక్షన్లు, నీటి, మురుగునీటి వ్యవస్థలు ఆటోమెటిక్‌గా డిస్‌కనెక్ట్‌ అవుతాయి. 

ఇంటి చుట్టూ మంటలు ఆర్పేసే గ్యాస్‌ పనిచేసేందుకు రెడీ అవుతుంది. ఇల్లు మొత్తం లోపలకు దిగిపోగానే బాక్స్‌ పైకప్పు మొత్తం మూసుకుపోతుంది. ఈ ప్రక్రియ మొత్తం 15 నిమిషాల్లో ముగిసిపోతుందని, మొత్తం వ్యవహారం గురుత్వాకర్షణ శక్తిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి విద్యుత్తు అవసరం కూడా ఉండదని దీని సృష్టికర్తలు చెప్పారు. ఇంటిని ఒక బంకర్‌లా వాడుకోవడం కుదరదు. విపత్కర పరిస్థితుల్లో ఇంటిని కాపాడొచ్చుగానీ ఆ సమయంలో ఇంట్లో ఉండేందుకు వీలుండదని ఇంజినీర్లు స్పష్టంచేశారు.       

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌
 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)