Breaking News

UN: ఉక్రెయిన్‌పై ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన

Published on Mon, 01/15/2024 - 15:04

న్యూయార్క్‌: రష్యాతో యుద్ధం కారణంగా  చిధ్రమైన ఉక్రెయిన్‌కు, దేశం విడిచి వెళ్లిన ఉక్రెయిన్‌ శరణార్థులకు సాయం చేయాల్సిందిగా భాగస్వామ్య దేశాలను ఐక్యరాజ్య సమితి(యూఎన్‌) విజ్ఞప్తి చేసింది. ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌ను ఆదుకోవడానికి కనీసం 4.2 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం అవసరమని యూఎన్‌ తెలిపింది.

‘రష్యాతో సుదీర్ఘ యుద్ధం కారణంగా వందల వేల సంఖ్యలో చిన్న పిల్లలు కనీస అవసరాలకు కూడా నోచుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ దారుణమైన పరిస్థితుల వల్లే ఉక్రెయిన్‌కు సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.  ఉక్రెయిన్‌ జనాభాలోని 40 శాతం అంటే కోటి నలభైఆరు లక్షల మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు.  వీరిలో 33 లక్షల మంది ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో  బిక్కబిక్కు మంటూ జీవితం గడుపుతున్నారు.

4.2 బిలియన్‌  డాలర్లలో 3.1 బిలియన్‌ డాలర్లు ఉక్రెయిన్‌కు కావాల్సి ఉండగా 1.1 బిలియన్‌ డాలర్లు ఉక్రెయిన్‌ శరణార్థులకు అవసరమని యూఎన్‌ వెల్లడించింది. శరణార్థులకు ఆశ్రయమిస్తున్న దేశాలకు ఈ సాయం అందిస్తామని తెలిపింది. శరణార్థులకు తాము తిరిగి ఉక్రెయిన్‌ రావాలన్న భావన కలగకుండా ఉండాలంటే వారిని కష్టాల నుంచి గట్టెక్కించాల్సి ఉందని యూఎన్‌ అధికారి ఫిలిప్పో గ్రాండి అభిప్రాయపడ్డారు.

కాగా, 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్‌ నుంచి 63 లక్షల మంది ఇతర దేశాలకు పారిపోయారు. మరో నలభై లక్షల మంది దేశంలోనే చెల్లాచెదురయ్యారు. వీరిలో ఒక లక్ష మంది దాకా చిన్న పిల్లలు కూడా ఉండటం గమనార్హం.

ఇదీచదవండి.. బద్దలైన అగ్ని పర్వతం.. ఇళ్లపైకి లావా ప్రవాహం   

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు