Breaking News

మహిళల కోసమే 102 అంతస్తుల భవనం! కేవలం వారు తప్ప..

Published on Tue, 05/02/2023 - 14:50

ఆ బహుళ అంతస్తుల భవనం కేవలం మహిళలకు మాత్రమే అద్దెకిస్తారు. పురుషులకు మాత్రం అస్సలు అనుమతి లేదు. స్త్రీల కోసమే ప్రత్యేకంగా ఆ ఆ ప్లాట్‌లను తీర్చిదిద్దారట. ఈ బహుళ​ అంతస్తుల భవనం యూకేలో ఉంది. బ్రిటన్‌ తొలిసారిగా మహిళల కోసమే బహుళ అంతస్తుల భవనాన్ని లండన్‌లో నిర్మిస్తోంది. వివరాల్లోకెళ్తే..బ్రిటన్‌లో 1902లో ఓటింగ్‌ ఉద్యమంలో భాగంగా స్థాపించిన హౌసింగ్‌ అసోసియేషన్‌ దీన్ని నిర్మిస్తుంది. ఈ ప్రోపర్టీకి యజమాని అయిన ఉమెన్స్‌ పయనీర్‌ హౌసింగ్‌(డబ్ల్యూపీహెచ్‌) సంస్థ ప్రతి అపార్ట్‌మెంట్‌ని మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించనున్నట్లు తెలిపారు.

మోనోపాజ్‌ దాటిన పెద్ద వయసు మహిళలకు తగిన విధంగా బాల్కనీ, మంచి వెంటిలేషన్‌ ఉండేలా ఆధునాత సౌకర్యాలతో ప్రతి అపార్ట్‌మెంట్‌ని తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించింది. ఈ ఫ్లాట్‌లను కేవలం గృహవేధింపులకు గురైన మహిళలకు, ఒంటరి మహిళలకు, నల్లజాతి స్త్రీలకు, అవసరమైతే ఒంటరిగా ఉన్న మైనారీటి మహిళలకు మాత్రమే అద్దెకు ఇస్తారని డబ్ల్యూపీహెచ్‌ పేర్కొంది. డబ్ల్యూపీహెచ్‌ నిబంధనల ప్రకారం..ఒంటరి మహిళలు మాత్రమే ఈ అపార్ట్‌మెంట్‌లో ఉండాలి. ఈ అపార్ట్‌మెంట్‌కి మహిళలు మాత్రమే అద్దెదారు అయ్యి ఉండి, ఆమె భాగస్వామినిగా ఉన్న పురుషుడు అయితే ఉండొచ్చు.

అలాగే ఒంటిరి మహిళలకు మగ సంతానం ఉన్నట్లయితే వారు కూడా ఉండవచ్చని పేర్కొంది. అలాగే ట్రాన్స్‌జెండర్‌ మహళలు కూడా అద్దెకుండటానికి అనుమతి ఇస్తున్నట్లు డబ్ల్యూపీహెచ్‌ స్పష్టం చేసింది. అయితే ఈ భవనంపై కోర్టులో వివాదం నడుస్తున్నట్లు సమాచారం. కొందరు మాత్రం ఈ ప్రాజెక్టు అంతగా బాగోలేదని పెదవి విరిచారు.  మహిళలకు ఇంత పెద్ద భవనం వారిని ప్రమాదంలోకి నెట్టేస్తుందని, అన్ని మెట్లు ఎక్కలేరంటూ విర్శలు వినిపిస్తున్నాయి.

కానీ ఈ భవనం రూపొందిస్తున్న ఆర్కిటెక్ట్‌ కోలిన్‌ వీచ్‌ ఆ విమర్శలను కొట్టి పారేసింది. ఈ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున​ మహిళలు మద్దతిస్తున్నట్లు చెప్పింది. ఈ భవనం మహిళలకు గృహవసతి కల్పిస్తుందన్నారు. నాలాంటి మహిళలు ఎందరికో  ఇది ఆవాసంగా ఉపయోగపడుతుందన్నారు. దీని ద్వారా మహిళలు అనితరసాధ్యమైన సవాళ్లు చాలా సునాయాసంగా అధిగమించగలరని వీచ్‌ చెప్పుకొచ్చారు.  

(చదవండి: ఆకలితో ఉన్న ఓ విద్యార్థి ఏం చేశాడంటే..ఏకంగా రూ. 98 లక్షలు ఖరీదు చేసే..)

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)