Breaking News

ఉక్రెయిన్‌ ప్రధాని యూలియా రాజీనామా 

Published on Mon, 07/13/2026 - 06:14

కీవ్‌: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ తన ప్రభుత్వంలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మహిళా ప్రధాని యూలియా స్విరిడెంకో ఆదివారం రాజీనామా చేశారు. రష్యాతో యుద్ధం కొనసాగుతుండటంతో పదవీ కాలం ముగిసినప్పటికీ రాజ్యాంగం ప్రకారం జెలెన్‌స్కీ పదవిలో కొనసాగుతున్నారు. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో యూలియా అమెరికాతో ఖనిజ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. 

ఈ ఒప్పందం తర్వాత ఆమె 2025 జూలైలో తన 39వ ఏట ప్రధానిగా నియమితులయ్యారు. తనకు మరింత కీలకమైన పదవిని ఇస్తానంటూ జెలెన్‌స్కీ వాగ్దానం చేసినట్లు రాజీనామా అనంతరం యూలియా సోషల్‌ మీడియాలో వెల్లడించారు. అయితే, ఆ పదవి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఉక్రెయిన్‌ రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంటోందంటూ యూలియా స్విరిడెంకో రాజీనామా నేపథ్యంలో జెలెన్‌స్కీ ప్రకటించడం గమనార్హం. 

ముఖ్యమైన అంతర్జాతీయ భాగస్వామి దేశంతో సంబంధాలను మెరుగుపర్చుకునే విషయంలో ఆమెకు అత్యంత కీలకంగా వ్యవహరించే అవకాశం కల్పిస్తామన్నారు. ప్రభుత్వంలోని ఇతర విభాగాల్లోనూ భారీగా మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇంధన మంత్రి డెనిస్‌ ష్మిహాల్, అంతర్గత శాఖ మంత్రి ఇహోర్‌ క్లిమెంకో, రక్షణ మంత్రి మైఖెయిలో ఫెదొరొవ్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. కాగా, రష్యా దురాక్రమణ మొదలైన తర్వాత నాలుగేళ్లలో ఇది నాలుగో కీలక ప్రక్షాళన కానుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)